రష్మిక మందన్న రూటు మార్చింది.ఇప్పటి దాకా హీరోల పక్కన స్టెప్పులేసిన ఈ భామ ఇపుడు సోలోగా కత్తి తిప్పుతానంటుంది. ఇన్ని రోజులుగా లవర్ గా,భార్య గా , వేసిన పాత్రలు బోరు కొట్టాయంటూ సరికొత్తగా ఒక వారియర్ పాత్రలో కనిపించేందుకు రెడీ అయిపొయింది.అవును ..తాజాగా వదిలిన మైసా టీజర్ లో రష్మికని చూస్తే తను మన నేషనల్ క్రష్ తనేనా అని డౌట్ వచ్చేంతంగా మేకోవర్ అయిపొయింది.
టీజర్ లో రష్మిక చాలా సీరియస్‌గా కనిపిస్తోంది. ముఖంలో కోపం, కళ్లలో ఫైర్, బాడీ లాంగ్వేజ్‌లో డిఫరెంట్ అటిట్యూడ్ కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు రష్మిక చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఈ క్యారెక్టర్ ఉండబోతుందనే ఫీలింగ్ టీజర్ ఇచ్చింది. కథలో ఏదో పెద్ద సమస్య మధ్యలో ఆమె చిక్కుకున్నట్టుగా కనిపిస్తోంది. కానీ అసలు ఆ సమస్య ఏంటి? ఆమె ఎవరు? ఆమె వెనుక ఉన్న కథ ఏంటి? అనే విషయాలను మాత్రం మేకర్స్ సస్పెన్స్‌లోనే పెట్టారు.
అయితే టీజర్ లో రావు రమేష్ చెబుతూ ”ఆయుధం ఏ యుద్ధానికీ భయపడదు.. తనే ఓ ఆయుధం” అంటూ రష్మిక కి ఇచ్చిన ఎలివేషన్ చూస్తుంటే ఈ సినిమాలో రష్మిక ని ఒక వెపన్ గా తీర్చి దిద్దినట్టు కనిపిస్తుంది.
‘మైసా’ కథ గిరిజన ప్రాంతాల బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని తెలుస్తోంది. అక్కడి పరిస్థితులు, ప్రజల జీవితం, వాళ్ల చుట్టూ జరిగే సంఘర్షణలు, వాటి మధ్యలో రష్మిక పాత్ర.. ఇవన్నీ కలిపి సినిమాను ఒక ఇంటెన్స్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది.
ఈ సినిమా ద్వారా దర్శకుడు రవీంద్ర పుల్లే ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అంటే ‘మైసా’ ఆయనకు డెబ్యూ మూవీ. మొదటి సినిమాకే ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌ను ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా కథను గ్లామర్ టచ్ ఉన్న రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌లో కాకుండా.. గిరిజన ప్రాంతాల నేపథ్యంలో సీరియస్‌గా చెప్పే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది.
ఇక సినిమాలో రష్మికతో పాటు ఈశ్వరీ రావు, రాహుల్ రవీంద్రన్, సముద్రఖని, రావు రమేష్, తారక్ పొన్నప్ప, నిధి సింగ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ కాంబినేషన్ చూస్తే సినిమాలో కేవలం హీరోయిన్ చుట్టూనే కథ తిరగకుండా.. చాలా మంది పాత్రలకు ప్రాధాన్యం ఉండే అవకాశం కనిపిస్తోంది.
అయితే ‘మైసా’లో అసలు హైలైట్ రష్మిక క్యారెక్టరే అని టీజర్ చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది.ఆమె ఎందుకు ఇంత కోపంగా ఉంది? ఆమె జీవితంలో ఏం జరిగింది? గిరిజన ప్రాంతంలో జరుగుతున్న గొడవతో ఆమెకు ఉన్న సంబంధం ఏంటి? అనే ప్రశ్నలు ఇప్పుడు ఫ్యాన్స్‌లో ఆసక్తి పెంచుతున్నాయి.
మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ సినిమా నవంబర్ 27, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. పాన్-ఇండియా సినిమాగా పలు భాషల్లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
మొత్తానికి ‘మైసా’ టీజర్‌తో రష్మిక మరోసారి తనను తాను కొత్తగా చూపించడానికి రెడీ అయిపోయింది. ఇప్పటివరకు చూసిన రష్మిక వేరు.. ‘మైసా’లో కనిపించబోయే రష్మిక వేరు అన్నట్టుగా టీజర్ ఉంది. సినిమా కథను మేకర్స్ ఎంతవరకు సస్పెన్స్‌లో ఉంచుతారు? రష్మిక పాత్రలో అసలు ట్విస్ట్ ఏంటి? అన్నది తెలియాలంటే నవంబర్ 27 వరకు వెయిట్ చేయాల్సిందే.








