AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అనంతపురం జిల్లాలో వైసీపీ శ్రేణుల దౌర్జన్యం. ! బ్యాలెట్ బాక్సును బద్దలుకొట్టిన వైసీపీ నేతలు..!

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అనంతపురం జిల్లాలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. కూడేరు మండలం మరుట్లలోని పోలింగ్ కేంద్రంలో వైసీపీ నేతలు వీరంగం సృష్టించారు. పోలింగ్ బూత్‌లో ఉన్న బ్యాలెట్ బాక్సును బయటకు లాక్కొచ్చి రాళ్లతో బద్దలుకొట్టారు. ఈ ఘటనను అడ్డుకోబోయిన పోలీసులపైనా వారు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు.

ఇదే తరహాలో జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ వైసీపీ శ్రేణులు దాడులకు దిగాయి. బ్రహ్మసముద్రం మండలం పోలేపల్లిలో పోలింగ్ కేంద్రం వెలుపల ఉన్న టీడీపీ కార్యకర్తలపై దాడి చేశారు. శెట్టూరు మండలం చిందర్లపల్లిలో ఏకంగా పోలింగ్ కేంద్రంలోకి చొరబడి టీడీపీ ఏజెంట్లపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గాయపడిన అమిలినేని యశ్వంత్‌ అనే కార్యకర్తను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ANN TOP 10