AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జూపల్లి చూపు బీజేపీ వైపు..!

పార్టీలో చేరాలని ఫోన్‌ చేశా: డీకే అరుణ
రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటున్నట్లు కనిపిస్తుండటంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో అసంతృప్తిగా ఉన్న నేతలు, ఆ పార్టీలలో టికెట్ దక్కని భావిస్తున్న నేతలు కాషాయ పార్టీ వైపు చూస్తోన్నారు. అందులో భాగంగా ఇటీవల బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై బీజేపీ ఫోకస్ పెట్టింది. తమ పార్టీలో చేరాల్సిందిగా ఆయనను కాషాయ నేతలు కోరుతున్నారు. ఈ మేరకు మాజీ మంత్రి డీకే అరుణ ఆయనకు ఫోన్ చేశారు. బీజేపీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. కానీ కార్యకర్తలతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటానని జూపల్లి చెప్పినట్లు డీకే అరుణ మీడియాకు వెల్లడించారు.

జూపల్లితో ఫోన్‌లో మాట్లాడానని, బీజేపీలో చేరాల్సిందిగా ఆహ్వానించినట్లు డీకే అరుణ స్పష్టం చేశారు. కార్యకర్తలతో చర్చించిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తానంటూ ఆయన చెప్పినట్లు తెలిపారు. తమ మధ్య ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని, పార్టీ పరంగానే విబేధాలు ఉన్నాయని స్పస్టం చేశారు. బీఆర్‌ఎస్‌లోని చాలామంది అసంతృప్తులు తమతో టచ్‌లో ఉన్నారని, బీఆర్ఎస్‌ను ఓడించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని డీకే అరుణ పేర్కొన్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో రూ.కోట్లు చేతులు మారాయని, ఇందులో ప్రభుత్వ పాత్ర ఉందని ఆరోపించారు. టాపిక్‌ను డైవర్ట్ చేసేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని, కాషాయ నేతలను అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారని విమర్శించారు. పేపర్ లీక్ వల్ల ఎంతోమంది అభ్యర్థులు నష్టపోతున్నారని, పరీక్ష రాసిన అభ్యర్థులందరికీ రూ.లక్ష నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు.

అయితే జూపల్లి బీజేపీలో చేరతారనే ప్రచారం సాగుతోంది. అలాగే కాంగ్రెస్ నేతలు కూడా ఆయనను ఆహ్వానిస్తున్నారు. తమ పార్టీలో చేరితే ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. దీంతో ఏ పార్టీలో చేరాలనే దానిపై జూపల్లి సమాలోచనలు చేస్తోన్నారు. అనుచరులు, కార్యకర్తలతో చర్చలు జరుపుతున్నారు. భవిష్యత్ కార్యాచరణపై త్వరలో జూపల్లి క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఆయన ఏ పార్టీలో చేరతారో చూడాలి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10