AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వారణాసిలో మైండ్ బ్లోయింగ్ వైల్డ్ యాక్షన్ ఎపిసోడ్‌..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ట్రెండ్ సెట్టర్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవెయిటెడ్ గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి గురించి రోజుకో క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన ఒక విభిన్నమైన ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్‌డ్రాప్‌లో జక్కన్న ఈ విజువల్ వండర్‌ను ప్లాన్ చేశారు. గతంలో తన సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి, ఈసారి మహేష్ బాబుతో కలిసి ఇండియన్ స్క్రీన్ పై ఇంతవరకు చూడని సరికొత్త మాయాజాలాన్ని సృష్టించేందుకు సర్వం సిద్ధం చేశారు.

 

మైండ్ బ్లోయింగ్ వైల్డ్ యాక్షన్ ఎపిసోడ్‌

 

ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో బాలీవుడ్ గ్లోబల్ ఐకాన్ ప్రియాంకా చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, మాలీవుడ్ వెర్సటైల్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కుంబ అనే పవర్‌ఫుల్ నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్టు టాక్. వీరితో పాటు నటులు ప్రకాష్ రాజ్, మాధవన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ యాక్షన్ షెడ్యూల్ నెట్టింట విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తోంది. జక్కన్న మార్క్ ఒళ్లు గగుర్పొడిచే స్టంట్స్, కళ్ళు చెదిరే భారీ సెట్స్, ఇంటెన్స్ యాక్షన్ కొరియోగ్రఫీతో కూడిన ఒక మైండ్ బ్లోయింగ్ వైల్డ్ యాక్షన్ ఎపిసోడ్‌ను ప్లాన్ చేశారట జక్కన్న.

 

దాదాపు నెల రోజుల పాటు నాన్-స్టాప్‌

 

దీనికోసం దాదాపు నెల రోజుల పాటు నాన్-స్టాప్‌గా షూటింగ్ నిర్వహించనున్నారని, భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్ ఇప్పటివరకు ఎవరూ ప్రయత్నించలేదని ఇన్‌సైడ్ టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ‘ఆర్ఆర్ఆర్’ లోని ఇంటర్వెల్ ఫారెస్ట్ ఫైట్ సీన్‌ను మించి ఈ సరికొత్త ఎపిసోడ్ ఉండబోతుందని, జక్కన్న తన పాత రికార్డులను తానే బద్దలు కొట్టడం ఖాయమని పండగ చేసుకుంటున్నారు మూవే లవర్స్.

 

కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్స్ నేరుగా ఈ ప్రాజెక్ట్ కోసం రంగంలోకి దిగడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారని సమాచారం. మొదటి భాగాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా అత్యంత గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది కూడా.

 

మేకర్స్ ఏమైనా క్లారిటీ ఇస్తారేమో !

 

ఇక రెండవ భాగాన్ని 2029లో విడుదల చేసేందుకు స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఏది ఏమైనా గతంలో ‘బాహుబలి’ సినిమాతో రెండు భాగాల ట్రెండ్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడిపించిన రాజమౌళి, ఈ ఫారెస్ట్ అడ్వెంచర్ సిరీస్‌తో మరోసారి బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సరికొత్త మేకోవర్, రాజమౌళి అద్భుత విజన్ తోడైతే థియేటర్లలో విజువల్ ఫీస్ట్ ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే పూస్‌బంప్స్ వస్తున్నాయి. చూడాలి మరి సర్క్యులేట్ అవుతున్న ఈ వార్తలపై మేకర్స్ ఏమైనా క్లారిటీ ఇస్తారేమో !

ANN TOP 10