AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రూటు మార్చారా..? ఏపీ రాజకీయాల్లో దూకుడు పెంచారా..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రూటు మార్చారా? ఏపీ రాజకీయాల్లో దూకుడు పెంచారా? దాదాపు పుష్కరకాలం సైలెంట్‌గా ఉన్న ఆయన, మనసులోని బాధ, ఆలోచనను బయట పెట్టారా? ఈ క్రమంలో కాపు నేతలకు వార్నింగ్ ఇచ్చారా? ఆయన చేసిన వ్యాఖ్యలు నేరుగా వైసీపీకి తగిలినట్టేనా? అవుననే అంటున్నారు ఆ పార్టీలోని కొందరు నేతలు. అసలేం జరిగింది?

 

కాపు నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కల్యాణ్

 

రాజమహేంద్రవరంలో మంగళవారం పార్టీ కార్యకర్తలకు కోసం ఏర్పాటు చేసిన సాధక్‌ల సమావేశంలో మాట్లాడారు అధినేత పవన్ కల్యాణ్. కాపు నాయకుల పేరుతో పదే పదే తనపై నిందలు వేస్తే ఇక ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. తనకు కులం ముఖ్యం కాదని పార్టీ గురించి నిలబడిన వాళ్లే ముఖ్యమని తేల్చేశారు.

 

అభాండాలు.. అన్యాయాల మీద జనసేన రాజీలేని పోరాటం చేస్తోందన్నారు. ఇక నుంచి పార్టీపై జరిగే విష ప్రచారానికి గట్టిగా బదులివ్వాలని తేల్చిచెప్పారు. దేశ కోసం, నేల కోసం, రాష్ట్రం కోసం రాజకీయాల్లోకి వచ్చానని మనసులోని మాట బయటపెట్టారు. తనను విమర్శించే కాపు నాయకులకు చిన్నపాటి వివరణ ఇచ్చారు.

 

మీ గురించి చిట్టా విప్పితే.. తట్టుకోలేరని సూటి ప్రశ్న

 

తనను విమర్శించే మీరందురు మీరే ఒక సీఎం అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకుని ముఖ్యమంత్రిని చేయాలని సలహా ఇచ్చారు. మీరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకోవాలని సూచన చేశారు. మీరు అలా చేస్తే తనకు చాలా సంతోషమన్నారు. ఈ విషయంలో మీకు కంగ్రాట్స్ చెబుతానని, మీరు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత తనపై కేసులు పెట్టుకోవచ్చారు. ఈ విషయంలో తనకు ఏ మాత్రం ఇబ్బంది లేదన్నారు.

 

మాట్లాడితే చీటికి మాటికీ వంగవీటి రంగాను తెరపైకి తేవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. వారికి పుట్టిన పిల్లలు రెండు కులాలకు చెందినవారని గుర్తు చేశారు. ఆయన బతికున్నప్పుడు ఏ ఒక్కరు మాట్లాడలేదని, చనిపోగానే అందరికీ కోపాలు వచ్చాయన్నారు. అందరు తనపై పడ్డారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

 

తన పక్కన లింగమనేని ఉంటే కమ్మ అంటారు.. మరింకెవరూ ఉండకూడదా? తెలంగాణ వ్యక్తిని తీసుకొస్తే కులాన్ని అంటగడుతున్నారని అంటూ కాసింత ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మాట్లాడితే తట్టుకోగలరా..మీ అందరి చిట్టా విప్పనా? పనికిమాలిన విశ్లేషణలు, విమర్శలకు బలంగా సమాధానం ఇస్తానని తేల్చిచెప్పారు.

 

మీ నోళ్లు మూతపడే వరకు అందరి చేత మాట్లాడిస్తానని చెప్పకనే చెప్పారు జనసేనాని. సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని, మీరు ఆ స్థాయిని దాటేశారని చెప్పుకొచ్చారు. జగన్ పార్టీ ఓడిపోతే సామాజిక వర్గం నుంచి పేర్లు మార్చుకుంటాం అన్నారా? అంటూ ప్రశ్నలు రైజ్ చేశారు. చంద్రబాబు నువ్వేం చేసావ్ కమ్మవారు ఎవరైనా మాట్లాడతారా? అంటూ పలువురు కాపు నేతలకు సూటిగా వార్నింగ్ ఇచ్చారు పవన్ కల్యాణ్.

ANN TOP 10