ఏపీలో లిక్కర్ స్కామ్ ఆరోపణలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మద్యం వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ‘కశిరెడ్డి’ అంటూ ఎవరో ఒకరి పేరును ఇష్టమొచ్చినట్లు తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ హయాంలోని ధరలనే తమ ప్రభుత్వంలోనూ కొనసాగించామని స్పష్టం చేశారు.
జగర్ ఫైర్..
ఏపీలో మద్యం విధానం లిక్కర్ స్కామ్ ఆరోపణలపై వస్తున్న ఆరోపణలపై వైఎస్సార్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసమే కొందరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని జగర్ ఫైర్ అయ్యారు. లేని వివాధాన్ని సృష్ట్రించే ప్రయత్నం చేస్తున్నారని జగన్ ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి మద్యం ధరల వివాదాన్ని సమర్థిస్తూ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఏ ధరలు ఉన్నాయో అదే ధరలకు మా ప్రభుత్వంలోను సేమ్ అవే ధరలు కొనసాగించామని తెలిపారు. మద్యం రేట్ల విషయంలో మేము కొత్తగా చేసిందేమి లేదని జగన్ స్పష్టం చేశారు.
కావాలనే ప్రచారం..
మద్యం వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఎవరో ఒకరి పేరును ఇష్టమొచ్చినట్లు తెరపైకి తెస్తున్నారని అన్నారు. మద్యం వ్యాపారంలో గానీ కొత్త బ్రాండ్ల అనుమతులలో మా ప్రభుత్వం ఎలాంటి అవకతవకలు జరగలేదని జగన్ అన్నారు. కావాలని మాపై మా ప్రభుత్వం పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎవరికి నచ్చనట్టు వారు రాసుకోని ఎదోచేయాలని చూస్తున్నారని అన్నారు.







