ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల పుట్టినరోజు వేడుకలు లేదా స్పెషల్ అకేషన్ ఏదైనా ఉంది అంటే అభిమానులు ఆయా హీరోల కెరీయర్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రాలను మళ్లీ రీ రిలీజ్ చేస్తూ ఆనందం పొందుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు రీ రిలీజ్ లో నిర్మాతలకు భారీగా వసూళ్లు కూడా తెచ్చిపెడుతున్నాయి ఈ సినిమాలు. ఇక అందులో భాగంగానే సూపర్ స్టార్ కెరియర్ లో అత్యంత వైవిధ్యమైన చిత్రం వన్ నేనొక్కడినే. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సైకలాజికల్ చిత్రం విడుదలై 12 ఏళ్ళు అవుతున్నా.. ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్ గానే నిలిచింది.. ముఖ్యంగా 2014లో విడుదలైన ఈ సినిమా.. ఆ సమయంలో కథనం అప్పటి ప్రేక్షకులకు కొత్త క్లిష్టంగా అనిపించినా.. కాలక్రమేనా అది తెలుగు సినిమా స్థాయిని పూర్తిగా పెంచిన చిత్రంగా గుర్తింపు కూడా అందుకుంది. అంతేకాదు మహేష్ బాబు వారసుడు గౌతమ్ ఘట్టమనేని ఇండస్ట్రీకి నటుడిగా పరిచయమైన సినిమా కూడా ఇదే కావడంతో అటు ఘట్టమనేని అభిమానులలో ఈ సినిమా మరింత ప్రత్యేకత సొంతం చేసుకుంది. అంతేకాదు బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కూడా ఈ సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది.
ఫ్రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న 1 నేనొక్కడినే..
అలాంటి ఈ సినిమా ఇప్పుడు మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. ఇకపోతే మహేష్ బాబు నటనలోని ఇంటెన్సిటీ , సుకుమార్ స్క్రీన్ ప్లే మ్యాజిక్ ను మళ్లీ బిగ్ స్క్రీన్ పై అనుభూతి చెందాలని ఫ్యాన్స్ కూడా ఆరాటపడుతున్న నేపథ్యంలో . లెజెండ్రీ యాక్టర్ కృష్ణ జయంతి సందర్భంగా మే 31వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో తీసుకురాబోతున్నారు. ఇకపోతే దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ హూ ఆర్ యు, లండన్ బాబు వంటి సాంగ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో మళ్ళీ హోరెత్తనున్నాయి అనడంలో సందేహం లేదు..
ఆ గ్రాండ్ విజువల్స్ ను మళ్లీ తెరపై చూసే అవకాశం..
ఇకపోతే రత్నంవేలు విజువల్స్, హాలీవుడ్ స్టాండర్డ్స్ లో ఉండే సినిమాటోగ్రఫీని ఇప్పుడు ఫోర్ కే లో చూడడం ఒక అద్భుతమైన అనుభూతి . ఏది ఏమైనా వన్ నేనొక్కడినే సినిమా ఇప్పుడు రీ రిలీజ్ లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇకపోతే మరొకవైపు మహేష్ బాబు పోకిరి, మురారి సినిమాలు రీ రిలీజ్ లో భారీ వసూలు సాధించిన విషయం తెలిసిందే.
మహేష్ బాబు సినిమాలు..
మహేష్ బాబు విషయానికి వస్తే.. రాజమౌళి దర్శకత్వంలో ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కిస్తున్న చిత్రం వారణాసి. ఇప్పటికే ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుండగా.. ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మరొకవైపు ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను ఇటీవల మెక్సికోలో విడుదల చేసి.. ప్రపంచ స్థాయి అభిమానులను మెప్పించే ప్రయత్నం చేశారు రాజమౌళి. ఇక ఈ సినిమాతో మహేష్ బాబు కి గ్లోబల్ స్థాయి గుర్తింపు లభించడం ఖాయమని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు







