AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్ సినిమాలో మారిన హీరోయిన్..?

ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున బయోపిక్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రెటీలు రాజకీయ నాయకులు అలాగే క్రీడ రంగానికి చెందిన ప్రముఖుల బయోపిక్ సినిమాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే లెజెండరీ సింగర్ ఎమ్మెస్ సుబ్బలక్ష్మి(M.S.Subbalakshmi) బయోపిక్ సినిమా కూడా ప్రేక్షకులుగా వార్తలు బయటకు వచ్చాయి. ఈ సినిమాకు జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి(Gawtham Tinnanuri) దర్శకత్వం వహించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్నట్లు సమాచారం.

 

తప్పుకున్న సాయి పల్లవి..

ఇక ఈ బయోపిక్ సినిమాలో హీరోయిన్ ఎవరు నటించబోతున్నారనే విషయంపై ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి అయితే ఈ బయోపిక్ సినిమాలో సాయి పల్లవి(Sai Pallavi) ఎంపిక అయ్యారని ఈ సినిమాకు అనుగుణంగా ఆమె సంగీతంలో కొన్ని మెలకువలు కూడా నేర్చుకుంటున్నట్లు గతంలో వార్తలు బయటకు వచ్చాయి. రెండు రోజులుగా ఈ బయోపిక్ సినిమాకు సంబంధించి వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్ సినిమా నుంచి సాయి పల్లవి తప్పుకున్నారని ఆమె స్థానంలో మరొక పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రుక్మిణి వసంత్ నటించబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

 

ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గా రుక్మిణి వసంత్..

రుక్మిణి వసంత్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు ఈ నేపథ్యంలోనే ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్ సినిమాలో ఈమె అయితే సరిగ్గా సెట్ అవుతుందని చిత్ర బృందం భావించారని అందుకే సాయి పల్లవిని తప్పించి రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)ను ఎంపిక చేశారంటూ వార్తలు వైరల్ గా మారడంతో సాయి పల్లవి అభిమానులు షాక్ అయ్యారు. అయితే ఈ విషయంపై చిత్రం బృందం కూడా క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

 

డేట్స్ అడ్జస్ట్ కాకపోవడమే కారణమా?

 

ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి కొనసాగుతుందని రుక్మిణి వసంత్ నటించబోతున్నారు అంటూ వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని ఈ వార్తలను ఖండించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సాయి పల్లవి రామాయణ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ కారణంగా సాయిపల్లవి డేట్స్ అడ్జస్ట్ గాని నేపథ్యంలో ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్ సినిమా కాస్త ఆలస్యం అవుతుందని చిత్ర బృందం క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్ సినిమాలో సాయి పల్లవి అయితేనే సరిగ్గా సరిపోతారని ఆమె అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ బయోపిక్ సినిమాలో ఎవరు నటిస్తున్నారనే విషయంపై పూర్తిస్థాయిలో స్పష్టత రావాలి అంటే అధికారక ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.

ANN TOP 10