AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేతన్ హత్య వెనుక మాస్టర్ మైండ్ చేతన్ చౌదరే… సియాతో కలిసి దారుణం..!

పుణే సమీపంలో జరిగిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేతన్‌తో జరగాల్సిన తన ప్రియురాలు సియా గోయల్ పెళ్లిని ఆపేందుకే, చేతన్ చౌదరి ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ మేరకు చేతన్… సియాతో కలిసి ఈ హత్యకు పక్కా ప్రణాళిక రచించి, అమలు చేసినట్టు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి.

 

పోలీసుల విచారణ ప్రకారం, చేతన్‌తో ఉన్న ప్రేమ వ్యవహారం కారణంగా సియా ఈ పెళ్లికి ఇష్టపడలేదు. తన కెరీర్‌లో స్థిరపడేందుకు కనీసం మూడేళ్లు ఆగాలని చేతన్ కోరడంతో, నవంబర్‌లో జరగాల్సిన కేతన్ పెళ్లిని ఆపేందుకు ఇద్దరూ కలిసి హత్యకు పక్కా ప్రణాళిక రచించారు. ఈ మూడేళ్ల స్వేచ్ఛ కోసమే వారు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు సమాచారం.

 

హత్య జరిగిన జూన్ 18న నిందితుడు చేతన్ పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. ఉదయం 7 గంటలకు తన మొబైల్ డేటా ఆఫ్ చేసి, తన ఫోన్‌ను షాపులోనే వదిలేసి వెళ్లాడు. కాల్స్ వస్తే సమాధానం చెప్పాలని సిబ్బందికి సూచించాడు. దారిలో మరో ఉద్యోగి ఫోన్ తీసుకుని మాట్లాడాడు. మధ్యాహ్నం 33 డిగ్రీల ఎండలోనూ గుర్తుపట్టకుండా ఉండేందుకు మందపాటి హుడీ ధరించి కేతన్, సియాలను అనుసరించాడు. కోటపైకి వెళ్లాక, సియా ఇచ్చిన సంకేతాలతో పొద చాటు నుంచి చేతన్ బయటకు వచ్చి కేతన్‌ను 400 అడుగుల లోయలోకి తోసేశాడు.

 

అయితే, చేతన్ ప్లాన్ బెడిసికొట్టింది. దాదాపు 10 గంటల పాటు అతని ఫోన్ ఆఫ్‌లైన్‌లో ఉండటం, సీసీటీవీ ఫుటేజ్‌లో అతని వింత వేషధారణ, అతని ఫోన్‌కు వచ్చిన కాల్స్‌కు వేరేవాళ్లు సమాధానం చెప్పడం వంటి అంశాలు పోలీసులకు అనుమానం కలిగించాయి. దీంతో కేసును లోతుగా విచారించగా అసలు నిజం బయటపడింది. జూన్ 18 ఉదయం 10:45 గంటలకు సియా.. కేతన్ తల్లికి ఫోన్ చేసి, అతను ప్రమాదవశాత్తు లోయలో పడిపోయాడని చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సియా ఫోన్ తరచూ బిజీగా రావడం, పదేపదే చేతన్ ప్రస్తావన తేవడంతో తమకు ముందే అనుమానం వచ్చిందని వారు పేర్కొన్నారు.

ANN TOP 10