ఏ పెద్ద సినిమా మొదలైనా మొదటగా వినిపించే పదం ..సీక్వెల్ కూడా ఉంటుందా అని. కారణం ఒకప్పుడు సీక్వెల్ పేర్లతో వచ్చి బొక్కపడితే ఇప్పుడు అవే సీక్వెల్స్ కాసులు కురిపించడమే,దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాల్సి వస్తే మొదటగా వినిపించే పేరు బాహుబలి . జక్కన్న తెరకెక్కించిన ఈ సినిమానే సీక్వెల్స్ కి ఊపిరిపోసిందనే చెప్పాలి.
ఇక సుక్కు దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప2 అనే సీక్వెల్ కి సాలిడ్ స్టాంప్ వేసేసింది.పుష్ప కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా ఏకంగా 1800 వందల కోట్లు కొల్లగొట్టి టాలీవుడ్ పేరుని రీ సౌండ్ లో వినిపించేలా చేసింది.దీనికి తోడు కల్కి కి సీక్వెల్ గా కల్కి 2 పట్టాలెక్కడం, సలార్ కి కూడా సీక్వెల్ ఉంటుందని నీల్ అనౌన్స్ చేయడం వెరసి సీక్వెల్ అంటే కంపల్సరీ అన్నట్టుగా అయిపొయింది.దీంతో మహేష్ హీరోగా వస్తున్న వారణాసి కూడా రెండు భాగాలుగా ఉంటుందా ఏంటి అన్న అనుమానాలు మూవీ లవర్స్ లో రేకెత్తాయి.
కుండబద్దలు కొట్టేసిన జక్కన్న
ఇక సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా సీక్వెల్ పై ఇబ్బడి ముబ్బడిగా డిబేట్లు మొదలైపోయాయి.అయితే ఇదే విషయంపై ఎట్టకేలకి క్లారిటీ ఇచ్చేశాడు జక్కన్న. సినిమా షెడ్యూల్ కి కాస్త గ్యాప్ దొరకడంతో ఫ్రాన్స్‌లో జరిగిన ప్రతిష్టాత్మక ‘ఆన్నెసీ అంతర్జాతీయ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్న జక్కన్న అసలు విషయం చెప్పేశాడు.ఈ సినిమాకు ఎలాంటి సీక్వెల్స్ ఉండవని, ఇది కేవలం ఒకే ఒక్కపార్ట్ గా రాబోతుందని కుండబద్దలు కొట్టేశాడు.దీంతో ఈ సినిమా సిరీస్ గా రాబోతుందన్న వార్తలకి బ్రేక్ పడ్డట్టు అయింది.అంటే ఒకే ఒక పార్ట్ లో జక్కన్న మహేష్ విశ్వరూపాన్ని చూపించబోతున్నాడన్న మాట.
హాలీవుడ్ రేంజ్‌లో ఉండబోతున్న విజువల్స్
ఇక ఈ సినిమాకి రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథని ఇచ్చిన సంగతి తెల్సిందే. గతంలో ‘మగధీర’, ‘బాహుబలి’ వంటి మ్యాగ్నమ్ ఓపస్ కథలు అందించింది ఈయనే కావడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయ్.ఇక సినిమా విషయానికి వస్తే ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉండబోతోందని గతంలోనే హింట్స్ ఇచ్చారు. ఇందులో విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ హాలీవుడ్ రేంజ్‌లో ఉండబోతున్నాయని టాక్.
ఐదువేల కోట్లు అందుకుంటాడా ?
ఇక ఈ సినిమాలో మందాకిని గా ప్రియాంక చోప్రా కనిపిస్తుండగా, కుంబ పాత్రలో సిల్వర్ స్క్రీన్ ని షేక్ చెయ్యడానికి రెడీ అయిపోయాడు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్.చూడాలి మరి నా టార్గెట్ ఐదువేల కోట్లు అని మనసులో బలంగా ఫిక్స్ అయిన జక్కన్న వాటిని ఈ సినిమాతో అందుకుంటాడో లేదో !








