AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఒక్క ఓటు కూడా పోవ‌ద్దు-కంది శ్రీ‌నివాస రెడ్డి.. బేలలో ఎస్ఐఆర్ అవ‌గాహ‌నా స‌ద‌స్సు..

  • బీఎల్ఏ-2లు అప్ర‌మ‌త్త‌గా ఉండాల‌ని సూచ‌న‌

ఆదిలాబాద్ : అర్హుల ఓట్లు గ‌ల్లంతు కాకుండా పార్టీ మండ‌ల అధ్య‌క్షులు బీఎల్ఏ-2లు అప్ర‌మ‌త‌త్తంగా ఉండాల‌ని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి సూచించారు. సోమ‌వారం బేల మండ‌ల కేంద్రంలో నిర్వ‌హించిన స‌మావేశంలో ఆయ‌న ఎస్ ఐఆర్ ప్ర‌క్రియ ప‌ట్ల శ్రేణుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు. బీఎల్వోల‌తో ట‌చ్ లో ఉంటూ ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించాల‌న్నారు. మృతుల ఓట్లు త‌ప్ప మిగ‌తా ఓట్ల విష‌యంలో త‌గు జాగ్ర‌త్త అవ‌స‌ర‌మ‌న్నారు.ఎవ‌రి ఓటైనా తొల‌గిస్తే స‌మాచార‌మందించాల‌న్నారు. ఒక్క ఓటు కూడా చాలా ముఖ్య‌మ‌న్నారు.ఈ కార్య‌క్ర‌మంలో ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ రావు, కొండా గంగాధర్, కోలా నర్సింలు, శాంతన్ రావు, నిమ్మల గౌతమ్ రెడ్డి, అశోక్, అరవింద్ ,జైన‌థ్ మార్కెట్ క‌మిటీ వైస్ చైర్మన్ విలాస్ పాటిల్,బేల మాజీ జడ్పీటీసీ రాందాస్ నాక్లే, సర్పంచులు

దంతెలా వినోద్, గంభీర్ టాక్రె, శంకర్ భోక్రె, టెకం సత్యపాల్, ఉపసర్పంచుల అధ్యక్షులు సాగర్ టాక్రె, ఉప సర్పంచులు ప్రకాష్, బండి సుదర్శన్, నాయ‌కులు నగేష్ రెడ్డి ,నానాజీ వైద్య, మాడవి చంద్రకాంత్, బూబాన్ రమేష్, దోటె ఈశ్వర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ANN TOP 10