కాంగ్రెస్ పార్టీకి ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాజీనామా చేశారు. నేటి ఉదయమే ఢిల్లీకి చేరుకున్న మహేశ్వర్ రెడ్డి ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసేందుకు యత్నిస్తున్నారంటూ తొలుత వార్తలొచ్చాయి. ఇంతలోనే పార్టీకి ఖర్గే తన రాజీనామా లేఖను పంపించేసినట్టు తెలుస్తోంది. కొన్ని రోజులుగా మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. నిన్న క్రమశిక్షణ కమిటీ ఆయనకు షో కాజ్ నోటీస్ జారీ చేయడంతో మహేశ్వర్ రెడ్డి మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది.
మహేశ్వర్ రెడ్డి రాష్ట్ర బీజేపీ ఇన్ ఛార్జ్ తురుణ్ చుగ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. AICC కార్యక్రమాల కమిటీ ఛైర్మన్గా ఉన్న మహేశ్వరరెడ్డి.. గత కొంత కాలం నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీకి దగ్గరవుతున్నారని మహేశ్వరరెడ్డికి కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ క్రమంలో తనకు నోటీస్ ఇచ్చే అధికారం టీపీసీసీకి లేదని స్పష్టం చేసిన మహేశ్వరరెడ్డి.. ఖర్గేను కలుస్తానని ఢిల్లీ వచ్చారు. అనంతరం జరిగిన పరిణామాలతో బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈటలతో కలిసి గురువారం ఉదయం మహేశ్వర్ రెడ్డి తరుణ్ చుగ్ నివాసానికి చేరుకుని భేటీ అయ్యారు. బండి సంజయ్, ఈటల రాజేందర్, తరుగ్ చుగ్ తో సమావేశం అనంతరం అక్కడి నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలిసేందుకు మహేశ్వరరెడ్డి బయలుదేరారు.
ఇక నిన్న ఆయన తనకు షోకాజ్ నోటీస్ జారీ చేయడంపై మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఏ రోజు నేను పార్టీ గీత దాటలేదు. అంతర్గత సమావేశాల్లో మాత్రమే నేను మాట్లాడినా. రేవంత్ వెలుమ కమ్యూనిటీ మీద మాట్లాడినప్పుడు మాత్రమే నేను మాట్లాడలేదు. ఇప్పటికీ రేవంత్ రెడ్డి అంటే నాకు అభిమానం. సీనియర్ల మీటింగ్ నా ఇంట్లో ఉంటే దిగ్విజయ్ కోరిక మేరకు వాయిదా వేశాం. జనరల్ సెక్రటరీని మార్చమని మేము ఎప్పుడూ కోరలేదు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా. షోకాజ్ ఇవ్వడం బాధాకరం. ఖర్గేను కలిసి నిర్ణయం తీసుకుంటా. నేను పార్టీ మారాలంటే బాజాప్త రాజీనామ చేసి వెళతా. నేను పార్టీ మారాలని ఏ రోజు అనుకోలేదు. నా సమావేశాలకు బీజేపీ నేత అటెండ్ అయ్యారనే ది పచ్చి అబద్ధం. అమిత్ షా ను బీజేపీ పెద్దలను కలిసేవారికి షోకాజ్