AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మినా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో..! హజ్ యాత్రికుల కోసం గ్రాండ్ ఫ్రీ హెల్త్ క్యాంప్..

  • మినా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో
  • హజ్ యాత్రికుల కోసం గ్రాండ్ ఫ్రీ హెల్త్ క్యాంప్
  • హజ్ యాత్రికులకు ఉచిత పరీక్షలు.. మెడికల్ కిట్లు
  • హెల్త్ క్యాంప్ ప్రారంభించిన టీజీఎంఎఫ్ సీ ఛైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్

హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 9

మినా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో హజ్ యాత్రికులకు ఉచితంగా చికిత్స అందించి మెడికల్ కిట్లు పంపిణీచేసే కార్యక్రమాన్ని తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ ఛైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ ప్రారంభించారు. గురువారం ప్రారంభమైన క్యాంప్ 10, 11 హెల్త్ క్యాంప్ ద్వారా పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచితంగా మెడికల్ కిట్లు కూడా పంపిణీచేశారు. ఈ సందర్భంగా కొత్వాల్ మాట్లాడుతూ మీనా ఆస్పత్రి కరోనా కాలంలోనూ అద్భుత సేవలందించిందని, మైనారిటీలకే కాకుండా అన్నివర్గాల వారికి అతితక్కువ ఖర్చులో సేవలందించే మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిగా మీనా ఆస్పత్రి అందరి మన్ననలు అందుకుంటున్నదన్నారు. హజ్ కు వెళ్ళేవారికి ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహించడంతో పాటు మెడికల్ కిట్లు కూడా ఉచితంగా అందించడం సామాన్యవిషయం కాదన్నారు. జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ మేటర్నిటీ, ఎమర్జెన్సీ ,ట్రామా కేర్, ఐసీయూ సదుపాయాలతో అద్భుతంగా ఆస్పత్రి సేవలు అందిస్తున్నదని, ఛైర్మన్ హైదయతుల్లా ఖాన్ రోగులకు తక్కువ ఖర్చుతో సేవలందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో మీనా ఆస్పత్రి ఛైర్మన్ హైదయతుల్లాఖాన్, డైరెక్టర్ షోయబా షుకూర్ తదితరులు పాల్గొన్నారు. ఆప్తాల్మాలజీ (ఐ కేర్)కు డాక్టర్ హిదయతుల్లా ఖాన్ , డాక్టర్ బాసిత్ హుస్సేన్, గైనకాలజీ లో డాక్టర్ సోహెబా షుకూర్, జనరల్ మెడిసిన్ లో డాక్టర్ జవాద్ లు విశేష సేవలందిస్తున్నారు. రిజిస్టర్డ్ యాత్రికులందరికీ భోజనం అందించబడుతుందని, రిజిస్ట్రేషన్ కోసం 040-35262700, 040-35262701, 7396084445, 7396084446 నెంబర్లను సంప్రదించాలన్నారు.

ANN TOP 10