ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా నేడు ఆయన నటిస్తున్న సినిమా నుంచి టైటిల్ పోస్టర్ విడుదలైన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా తరువాత తన తదుపరి చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో సినిమాకు కమిట్ అయ్యారు. ఈ సినిమా గత కొన్ని నెలలుగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది దాదాపు 70% షూటింగ్ పనులు కూడా పూర్తి అయ్యాయని సమాచారం. ఇలా ఈ సినిమా ఇంత మొత్తంలో షూటింగ్ జరుపుకున్నప్పటికీ ఈ సినిమా నుంచి ఒక చిన్న విషయం కూడా బయటకు లీక్ అవ్వకుండా అట్లీ (Atlee)ఎంతో జాగ్రత్త పడ్డారు. ఇక నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో సినిమా నుంచి అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు.
అల్లు అర్జున్ తో అట్లీ భారీ ప్రయోగం..
అల్లు అర్జున్(Allu Arjun) పుట్టినరోజు సందర్భంగా నేడు అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు సంబంధించిన టైటిల్ రివీల్ చేశారు. ఇలా టైటిల్ తో పాటు పోస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల కావడంతో సోషల్ మీడియాలో ఈ పోస్టర్ ట్రెండింగ్ లో ఉంది. ఈ సినిమాకు “రాకా”(Raaka) అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ టైటిల్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ పోస్టర్ పై సోషల్ మీడియా వేదికగా ఎన్నో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పోస్టర్ చూస్తుంటే మాత్రం
డైరెక్టర్ అట్లీ అల్లు అర్జున్ తో భారీ ప్రయోగమే చేయబోతున్నారని స్పష్టమవుతుంది.
రాకా నా వెంట మోసుకొస్తున్న భారం..
ఇలా ఈ సినిమా నుంచి టైటిల్ పోస్టర్ విడుదల కావడంతో దర్శకుడు అట్లీ సోషల్ మీడియా వేదికగా నటుడు అల్లు అర్జున్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అదే విధంగా రాకా సినిమా గురించి ఈయన ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.. ఇలా అల్లు అర్జున్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అట్లీ రాకా సినిమా గురించి స్పందిస్తూ.. రాకా కేవలం సినిమా మాత్రమే కాదు కొన్ని సంవత్సరాలుగా నా వెంట మోసుకొస్తున్న భాగం. 18 ఏళ్లుగా ఒకే ఒక్క ఆలోచనతో ఉన్నాను, అది ఎప్పటికీ మసక బారకుండా చూసుకుంటున్నాను. ఆ ఆలోచన నన్ను పరీక్షించడమే కాకుండా మరింత తీర్చిదిద్దేలా చేసిందని ప్రతి సందర్భంలోనూ నాకు తోడుగా నిలిచిందని తెలిపారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ అట్లీ పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఈయన చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా సినిమా గురించి తనలో ఉన్న భావాలను అట్లీ బయట పెట్టడంతో ఈ సినిమా భారీ స్థాయిలో ఉండబోతుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు రాకా అనే టైటిల్ ప్రకటించడంతో ఈ పేరు వెనుక అర్థం ఏంటి అని చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ విడుదల చేయగా ఇందులో హీరోగాను విలన్ పాత్రలో కూడా అల్లు అర్జున్ నటించిన బోతున్నారు అంటూ అభిమానులు భావిస్తున్నారు.








