మెగా హీరోలు ప్రస్తుతం వరుస సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వరుసగా మెగా ఫ్యామిలీ నుంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి మరోవైపు కొంతమంది హీరోలు తమ సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉండగా మరి కొందరు కొత్త సినిమాలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చివరి దశ షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
క దర్శకులతో మెగా హీరో..
మరి కొద్ది రోజులలో ఈ సినిమా షూటింగ్ పూర్తి కాబోతున్న నేపథ్యంలో సాయి దుర్గ తేజ్ మరో కొత్త సినిమాకు కమిట్ అయ్యారని సమాచారం. ఈ సినిమాకు క సినిమా దర్శకులు సుజిత్, సందీప్ దర్శకులుగా వ్యవహరించబోతున్నారని తెలుస్తుంది అలాగే ఈ సినిమాని షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించబోతున్నారు. ఇక ఈ విషయాన్ని సాహూ గారపాటి తన అధికారిక ఎక్స్ వేదికగా స్పందిస్తూ రేపు మధ్యాహ్నం 12:06కి ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెల్లడించబోతున్నట్లు తెలియజేశారు.
షైన్ స్క్రీన్ బ్యానర్ లో సాయి దుర్గ తేజ్..
ఈ సినిమా రొటీన్ కథతో కాకుండా సరికొత్త జోనర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చర్చలు పూర్తి కావడంతో షూటింగ్ పనులను కూడా త్వరగా ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రేపు అధికారికంగా ఈ సినిమాను ప్రకటించి తదుపరి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించబోతున్నారు. మరి ఈ సినిమా ఏ జానర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది? ఇందులో హీరోయిన్ ఎవరు? అనే విషయాల గురించి స్పష్టత రావాల్సి ఉంది. ఇక సాయి ధరంతేజ్ ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు షూటింగ్లో బిజీగా ఉన్నారు. చివరి దశ షూటింగ్ పరువులను జరుపుకుంటుంది.
విడుదలకు సిద్ధంగా సంబరాల ఏటిగట్టు..
ఇక ఇటీవల కాలంలో సాయి ధరంతేజ్ విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈయన రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత కొంత కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇలా ప్రమాదం తర్వాత విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకోవడంతో సాయి తేజ్ సైతం స్క్రిప్ట్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తూ విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇటీవల ఈయన పుట్టినరోజు సందర్భంగా సంబరాల ఏటిగట్టు సినిమా నుంచి విడుదల చేసిన ఒక గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాకుండానే సాయి దుర్గా తేజ్ మరో కొత్త సినిమాకు కమిట్ అవ్వడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.








