AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మూసీ పునరుజ్జీవం… తెలంగాణ సబ్ కమిటీ కీలక నిర్ణయం..

మూసీ నది పునరుజ్జీవంపై తెలంగాణ ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పనులను ప్రజాస్వామ్యబద్ధంగా చేపట్టాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ఇందుకోసం మూసీ పునరుజ్జీవంపై ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించనున్నట్లు తెలిపింది.

 

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కూడిన సబ్ కమిటీ, సంబంధిత అధికారులతో ఈరోజు సమావేశమైంది. మార్చి 31వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు ప్రజల నుంచి అభిప్రాయాలను తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఏప్రిల్ 15వ తేదీ వరకు తమ అభిప్రాయలను, సూచనలను నేరుగా musirrdc@gmail.com కు మెయిల్ చేయవచ్చు.

ANN TOP 10