AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పవన్ కల్యాణ్ గురించి ట్వీట్ చేసి డిలీట్ చేసిన బాలినేని.. చర్చనీయాంశంగా మారిన ట్వీట్..

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనాని పవన్ కల్యాణ్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. తాడేపల్లిలోని జనసేన కార్యాలయంలో దాదాపు గంటన్నర పాటు వీరి సమావేశం జరిగింది. తన కుమారుడితో కలిసి పవన్ ను బాలినేని కలిశారు. సమావేశం ముగిసిన తర్వాత… మరో నాలుగు రోజుల్లో మరోసారి కలుద్దామంటూ బాలినేనికి పవన్ చెప్పారు.

 

మరోవైపు, బాలినేని వైసీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. మూడు రోజుల క్రితం ఒంగోలు వైసీపీ నేతలతో జరిగిన సమావేశంలో బాలినేని పేరును జగన్ ప్రస్తావించడం గమనార్హం. ఈ క్రమంలో బాలినేని నిన్న ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారు. ‘పవన్ కల్యాణ్ కేవలం నాయకుడు మాత్రమే కాదు. నమ్మకం, ఆదరణ, ఆశ్రయం’ అంటూ ఆయన పవన్ ను ఆకాశానికెత్తేశారు. తన కుమారుడు ప్రణీత్ రెడ్డితో కలిసి పవన్ తో దిగిన ఫొటోను షేర్ చేశారు. అయితే, ఆ తర్వాత ఆ ట్వీట్ ను ఆయన డిలీట్ చేశారు. బాలినేని ట్వీట్ ను తొలగించడం వెనుక కారణమేంటనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ANN TOP 10