AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తుగ్గలిలో దారుణం: ఎమ్మార్పీఎస్ నేత టీఎం రమేష్‌పై హత్యాయత్నం

కర్నూలు:తుగ్గలి

తుగ్గలి మండలంలోని బొందిమడుగుల గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టిఎమ్ రమేష్ పై శుక్రవారం సాయంత్రం హత్యాయత్నం చేసినట్లు తెలుస్తుంది. టీఎం రమేష్ బొందిమడుగులలో తన ఇంటి నుండి బోంతిరల్లా గ్రామం వైపు వాకింగ్కు వెళుతుండగా కొందరు గుర్తి తెలియని వ్యక్తులు ట్రాక్టర్ తో గుద్దించినట్లు తెలుస్తుంది. ఆ సమయంలో క్రింద పడిపోయిన టిఎం రమేష్ పై రాళ్లతో కూడా దాడి చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయమును రోడ్డుపై వెళ్తున్న కొందరు రమేష్ బంధువులకు తెలియజేయడంతో వారు అక్కడికి వచ్చి స్పృహ తప్పి పడిపోయిన రమేష్ ను చికిత్స నిమిత్తం డోన్ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది. టి ఎమ్ రమేష్ పై ఎందుకు హత్యాయత్నం చేశారో వివరాలు తెలియాల్సి ఉంది.

ANN TOP 10