AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బంగ్లాదేశ్‌లో ఆగని హింస: రెండు వారాల్లో ముగ్గురు హిందువుల దారుణ హత్య!

బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీల భద్రత దినదినప్రవర్థమానంగా మారుతోంది. గత రెండు వారాల వ్యవధిలోనే ముగ్గురు హిందువులు దారుణంగా హత్యకు గురికావడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. తాజా ఘటనలో మయమన్‌సింగ్‌ జిల్లాలో బజేంద్ర బిశ్వాస్ అనే హిందూ సెక్యూరిటీ గార్డు, తన సహోద్యోగి జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. నిందితుడు నోమన్ మియా సరదాగా తుపాకీ గురిపెట్టినప్పుడు ప్రమాదవశాత్తు కాల్పులు జరిగాయని పోలీసులు చెబుతున్నప్పటికీ, దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.

కేవలం 14 రోజుల వ్యవధిలో ఈ హత్యలు జరగడం అక్కడి హిందువులను భయాందోళనలకు గురి చేస్తోంది. డిసెంబర్ 18న దీపూ చంద్ర దాస్‌ను ఒక గుంపు కొట్టి చంపి నిప్పు పెట్టగా, ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే రాజ్‌బరి జిల్లాలో అమృత్ మండల్ అనే యువకుడు గ్రామస్తుల దాడిలో బలయ్యారు. ఇప్పుడు బజేంద్ర బిశ్వాస్ మృతితో ఈ వరుస హత్యల సంఖ్య మూడుకు చేరింది. హిందువులే లక్ష్యంగా ఇలాంటి దాడులు పెరగడంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

బంగ్లాదేశ్‌లో మైనారిటీల రక్షణపై భారత ప్రభుత్వం మరియు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు గట్టిగా విమర్శిస్తున్నప్పటికీ, అక్కడి తాత్కాలిక ప్రభుత్వం మాత్రం వీటిని కేవలం విడివిడి నేరాలుగానే పరిగణిస్తోంది. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ దాడులను అరికట్టడంలో విఫలమవుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా జరుగుతున్న ఈ ఘోరాలు బంగ్లాదేశ్‌లో మైనారిటీల మనుగడపై పెద్ద ప్రశ్నార్థకాన్ని మిగిల్చాయి.

ANN TOP 10