AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మహిళలకు, విద్యార్థులకు శుభవార్త: ఉచిత బస్సు ప్రయాణం కోసం టీఎస్‌ఆర్టీసీ స్మార్ట్ కార్డులు!

రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకోబోతుంది. స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. 2026 ఏడాది ప్రారంభం నుంచే ఈ కార్డులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం తెలంగాణ మహిళలు ఉచిత బస్సు పథకాన్ని వినియోగించుకోవడానికి గాను ప్రయాణ సమయంలో ఆధార్ కార్డు చూపించాల్సి వస్తోంది. అయితే త్వరలోనే ఈ ఇబ్బందిని తొలగించడానికి వీటి స్థానంలో లబ్ధిదారుల ఫోటో, పేరు, చిరునామా ఉన్న స్మార్ట్ కార్డు తీసుకు రావాలని ఆర్టీసీ నిర్ణయించుకుంది.

తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద మహిళలు రెండేళ్లలో 251 కోట్ల ప్రయాణాలు చేశారు. ప్రస్తుతం, తెలగాణలో మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి తమ వెంట ఆధార్ కార్డును తీసుకెళ్లాలి. ఒకవేళ కార్డు లేకపోతే, టికెట్ కొనుక్కోవాల్సి వస్తుంది. అయితే, ఈ ఇబ్బందులను తొలగించడానికి ఆర్టీసీ యాజమాన్యం స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ కొత్త స్మార్ట్ కార్డుల్లో లబ్ధిదారుల ఫోటో, పేరు, చిరునామా ఉంటాయి. ఢిల్లీలో వినియోగంలో ఉన్న ‘సహేలీ’ తరహాలో రాష్ట్రంలో స్మార్ట్ కార్డులను తీసుకురావాలని ఆర్టీసీ యోచిస్తోంది.

ఈ కార్డులు కేవలం మహిళలకు మాత్రమే పరిమితం కాదు. విద్యార్థుల బస్ పాస్‌లను కూడా స్మార్ట్ కార్డుల్లోకి మార్చేందుకు ఆర్టీసీ ప్రయత్నిస్తోంది. కొత్త విద్యా సంవత్సరం నుంచే హైదరాబాద్‌లో ఈ కార్డులను ప్రయోగాత్మకంగా ప్రారంభించి, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా విస్తరించాలని యోచిస్తున్నారు. రాయితీలతో ప్రయాణం చేసే వారికి కూడా ఈ స్మార్ట్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి. ఈ స్మార్ట్ కార్డుల వల్ల ప్రయాణం మరింత సులభతరం అవుతుందని ఆర్టీసీ భావిస్తోంది.

ఆర్టీసీ స్మార్ట్ కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా?

ANN TOP 10