AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ట్రంప్‌ కొత్త కూటమి యోచన: భారత్‌తో కలిసి ‘కోర్ ఫైవ్ (C5)’ ఏర్పాటు చేయనున్నారా?

యూఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూరప్ ఆధిపత్యం ఉన్న జీ7 వంటి సంప్రదాయ కూటములను పక్కన పెట్టేలా అమెరికా, రష్యా, చైనా, భారత్, జపాన్‌తో కలిసి ఎలైట్ ‘సీ5’ (కోర్ ఫైవ్) ఫోరాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారని పలు అంతర్జాతీయ రిపోర్టులు చెబుతున్నాయి. ఇప్పటివరకు ఈ సీ5 కూటమిపై అధికారిక ప్రకటన రాలేదు. అయితే, ఈ కొత్త హార్డ్ పవర్ గ్రూప్ (సైనిక శక్తి అధికంగా ఉన్న దేశాల కూటమి) ఆలోచన అమెరికా **“నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ”**కి సంబంధించిన లాంగ్‌ వెర్షన్‌లో ఉన్నట్లు అమెరికా పత్రిక ‘పొలిటికో’ రిపోర్ట్ చేసింది.

జీ7 దేశాల కూటమి నిబంధనల్లో రెండు అంశాలు ప్రధానంగా ఉంటాయి—అవి ధనిక, ప్రజాస్వామ్య దేశాలై ఉండాలి. అయితే, ట్రంప్ ఏర్పాటు చేయాలనుకుంటున్న సీ5 దేశాల కూటమిలో మాత్రం ఈ నిబంధనలు లేవు. “యునైటెడ్ స్టేట్స్, చైనా, రష్యా, భారత్, జపాన్ కలిసే ‘కోర్ ఫైవ్’ కూటమిని ఈ స్ట్రాటజీ ప్రతిపాదిస్తుంది. ఈ దేశాల్లో ఒక్కో దేశం జనాభా 100 మిలియన్ దాటే ఉంటుంది” అని రిపోర్ట్ తెలిపింది. జీ7లాగే కోర్ ఫైవ్ కూటమి కూడా నిర్దిష్ట అంశాలపై రెగ్యులర్‌గా సమిట్‌లలో చర్చలు జరుపుతుంది.

ప్రతిపాదిత సీ5 కూటమి మొదటి అజెండా మధ్యప్రాచ్య భద్రత, ముఖ్యంగా ఇజ్రాయెల్-సౌదీ అరేబియా అధికారిక సంబంధాలను సాధారణీకరణ చేయడం అని రిపోర్ట్ పేర్కొంది. అయితే, కోర్ ఫైవ్ కూటమి ఏర్పాటు యోచన ఉందన్న ప్రచారాన్ని వైట్ హౌస్ ఖండించింది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ హాన్నా కెల్లి స్పందిస్తూ, “33 పేజీల అధికారిక ప్లాన్‌ను విడుదల చేశాం. అంతేగానీ.. దానికి ప్రత్యామ్నాయ, ప్రైవేట్, సీక్రెట్ వెర్షన్ వంటిది ఏదీ లేదు” అని చెప్పారు. కాగా, ఈ ప్రచారంపై అమెరికా మిత్రదేశాలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

ANN TOP 10