దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో విజయం సాధించిన అనంతరం, మీడియా సమావేశంలో గౌతమ్ గంభీర్ స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీల పేర్లను ప్రస్తావించకపోవడంపై టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప విమర్శలు గుప్పించారు. రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఇద్దరూ ఈ సిరీస్‌లో శతకాలు, అర్ధ సెంచరీలతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినప్పటికీ, వారికి గంభీర్ తగిన గుర్తింపు ఇవ్వాల్సిందని ఊతప్ప అభిప్రాయపడ్డాడు.
ప్రస్తుతం ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో కూడా రోహిత్ శర్మ మొదటి స్థానంలో కొనసాగుతుండగా, విరాట్ కోహ్లీ రెండో స్థానానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో రాబిన్ ఊతప్ప మాట్లాడుతూ, టీమిండియా వన్డే సిరీస్ విజయం తర్వాత జరిగిన మీడియా సమావేశంలో గంభీర్ వారిద్దరికీ తగినంత గుర్తింపు ఇవ్వకపోవడం తాను గమనించానని అన్నారు. రోహిత్, కోహ్లీ ద్వయం తమ ఫామ్‌పై వస్తున్న సందేహాలకు తమ అద్భుతమైన ప్రదర్శనతో సమాధానం చెప్పారని ఆయన పేర్కొన్నారు.
ఈ ఇద్దరు సీనియర్ క్రికెటర్లు తమ అద్భుతమైన బ్యాటింగ్‌తో విమర్శకుల నోళ్లు మూయించారని, తాము ఫామ్‌లో ఉంటే జట్టు కోసం ఏం చేయగలమో చేసి చూపించారని రాబిన్ ఊతప్ప అన్నారు. కాగా, రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్లకు వీడ్కోలు పలికి, ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో తమ సత్తా చాటారు.









