AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీహార్ ఎన్నికల ప్రచారంలో నారా లోకేశ్: “ఏపీ మంత్రిగా కాదు, భారతీయుడిగా వచ్చాను”

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని సంచలనం సృష్టించారు. పాట్నాలో పర్యటించిన ఆయన, తాను ఆంధ్రప్రదేశ్ మంత్రిగా కాకుండా ఒక భారతీయుడిగా వచ్చానని ప్రకటించారు. బీహార్ ప్రజలు మరోసారి ఎన్డీయే కూటమికి అధికారం కట్టబెట్టాలని లోకేశ్ కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నాయకత్వంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. బీహార్‌లో మరోసారి ఎన్డీయే జెండా ఎగరడం ఖాయమని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా లోకేశ్ ప్రతిపక్షాలు ఇస్తున్న ఎన్నికల హామీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలు ‘ఒక ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం’ ఇస్తామని హామీ ఇస్తున్నాయని, అయితే అది నిజాయితీగా చెప్పాలంటే ఎప్పటికీ సాధ్యం కాదని స్పష్టం చేశారు. దీనికి విరుద్ధంగా, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ‘ఒక ఇంటికి ఒక పారిశ్రామికవేత్త’ అనే నినాదంతో ముందుకు వెళుతోందని ఆయన పేర్కొన్నారు.

ప్రతిపక్షాల హామీలు ప్రజలను పరాధీనంగా మార్చాలని చూస్తున్నాయని లోకేశ్ విమర్శించారు. “ప్రతిపక్షాలు పరాధీనతను నమ్ముతాయి, మేము ఎన్డీయేలో సాధికారతను నమ్ముతాం. అందుకే మా నినాదం, ఒక ఇంటికి ఒక పారిశ్రామికవేత్త” అని ఆయన వివరించారు. ఎన్నికల తొలి దశలో మాదిరిగానే, రాబోయే దశలో కూడా ఎన్డీయే కూటమి అద్భుతమైన ప్రదర్శన చేస్తుందని, బీహార్‌లో మరోసారి సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందని లోకేశ్ విశ్వాసం వ్యక్తం చేశారు.

 

ANN TOP 10