AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బల్క్ డ్రగ్ పార్క్ వివాదం: రాజయ్యపేటలో జగన్ పర్యటన ఖాయం – బొత్స సత్యనారాయణ హామీ

అనకాపల్లి జిల్లాలోని రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు ప్రతిపాదనపై నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో, వైసీపీ నేతలు ఆ గ్రామంలో పర్యటించి స్థానిక మత్స్యకారులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మత్స్యకార మహిళలు తమ ఆవేదనను ఎమ్మెల్సీ, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఎదుట వ్యక్తం చేశారు. బొత్స సత్యనారాయణ వారికి భరోసా ఇస్తూ, త్వరలోనే మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజయ్యపేటకు వచ్చి పార్టీ మొత్తం మత్స్యకారులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “బల్క్ డ్రగ్ పార్క్‌ను వ్యతిరేకిస్తున్న ప్రజలు సంఘ విద్రోహ శక్తులా? ఈ నిర్బంధం ఎందుకు?” అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంతేకాకుండా, వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బల్క్ డ్రగ్ పార్క్‌ను రద్దు చేస్తుందని స్పష్టం చేశారు. హోంమంత్రి అనితకు పాలన చేతకాకపోతే రాజకీయాల నుంచి తప్పుకోవాలని కూడా బొత్స విమర్శించారు.

మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్ కూడా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు బల్క్ డ్రగ్ పార్క్ వల్ల క్యాన్సర్లు వస్తాయని చెప్పిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక మాట మార్చిందని కన్నబాబు ఆరోపించారు. అమర్నాథ్ మాట్లాడుతూ, “గ్రామంలోకి రావాలంటే పోలీసులు ఆధార్ కార్డులు అడుగుతున్నారు. వందల ఏళ్లుగా ఇక్కడే బతుకుతున్న ప్రజలు ఈ దేశ పౌరులు కారా?” అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే తమపై పెట్టిన కేసులన్నింటినీ ఎత్తివేస్తామని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు.

ANN TOP 10