బీఆర్ఎస్ జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్శిటీలో ఈ ఉదయం ప్రమాదం జరిగింది. స్లాబ్ కూలి నలుగురు కూలీలకు గాయాలయ్యాయి. పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడ్డ కూలీలను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు కూలీల పరిస్థితి విషమంగా ఉంది. వీరు ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు.
యూనివర్శిటీ సిబ్బంది మీడియాను కూడా లోపలకు అనుమతించలేదు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కూలీల కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు ఆసుపత్రికి చేరుకున్నారు.