ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. నిన్న హైదరాబాద్ లో నిర్వహించిన రాజ్యభాష విభాగం స్వర్ణోత్సవ వేడుకల్లో పవన్ పాల్గొని హిందీ గురించి మాట్లాడారు. మాతృభాష అమ్మ అయితే, హిందీ భాష పెద్దమ్మ అని ఆయన అన్నారు. మనం హిందీ నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోయినట్టు కాదని… మనం మరింత బలపడటం అని చెప్పారు. ఇంకో భాషను అంగీకరించడం అంటే ఓడిపోవడం కాదని… కలిసి ప్రయాణం చేయడమని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. “ఈ రేంజ్ కి అమ్ముకోవడమా… ఛిఛీ… జస్ట్ ఆస్కింగ్” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
