దక్షిణాది గొప్ప సినీ దర్శకులలో ఒకరిగా పేరుగాంచిన డైరెక్టర్ శంకర్ ఇటీవల కొంత వెనుకబడ్డారు. తాజాగా ఆయన తెరకెక్కించిన రెండు సినిమాలు ‘ఇండియన్ 2’, ‘గేమ్ ఛేంజర్’ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయాయి. ఈ సినిమాల ఫెయిల్యూర్స్ కారణంగా ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆయన తన తదుపరి ప్రాజెక్ట్ ను ప్రకటించారు.
తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో శంకర్ మాట్లాడుతూ… ఒకప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రోబో’ అని చెప్పారు. ఇప్పుడు ‘వేల్పారి’ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలిపారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా రానుందని… ఇప్పటి వరకు చేసిన అతిపెద్ద చిత్రాల్లో ఇది ఒకటి అవుతుందని చెప్పారు. ఈ సినిమాకు భారీ స్థాయిలో కాస్ట్యూమ్స్, టెక్నాలజీ, ఆర్ట్ డిజైన్స్ అవసరమవుతాయని తెలిపారు. ‘అవతార్’, ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ వంటి చిత్రాలకు ఉపయోగించిన సాంకేతికతను పరిచయం చేయనున్నారు. ప్రపంచమంతా దీన్ని గుర్తిస్తుందని… తన కల త్వరలోనే నిజం కావాలని కోరుకుంటున్నానని చెప్పారు.