AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చంద్రబాబు మార్క్ బడ్జెట్ – కేటాయింపులు..!

ఏపీ ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 వార్షిక బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టారు. గత ప్రభుత్వంలో ఆర్దిక పరిస్థితిని వివరించారు. తిరిగి రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టటం తో పాటుగా ఆర్దికంగా బలోపేతం చేసేలా కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. ఎనిమిది నెలల కాలంలో తీసుకున్న నిర్ణయాలను కేశవ్ వివరించారు. చంద్రబాబు కు ఉన్న అనుభవం తో రాష్ట్రానికి తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు.

 

3.22 లక్షల కోట్లతో

ఏపీ ప్రభుత్వం 2025-26 కాలానికి రూ. 3 లక్షల 22వేల 359 కోట్ల అంచనాలతో బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైందని మంత్రి పయ్యావుల చెప్పుకొచ్చారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అపూర్వమైన తీర్పు ఇచ్చారని చెప్పారు. రాష్ట్ర పునర్ని ర్మాణం ఎన్నో సవాళ్లతో కూడుకున్న పనిగా పేర్కొన్నారు. రాజధాని ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కిస్తు న్నామని కేవశ్ వివరించారు. ఈ బడ్జెట్ లో రెవిన్యూ వ్యయం అంచనా 2,51,162 కోట్లు కాగా,మూల ధనం వ్యయం అంచనా 40,635 కోట్లుగా పేర్కొన్నారు.

రెవిన్యూ లోటు

ఇక, రెవిన్యూ లోటు 33,185 కోట్లు గా అంచనా వేసిన ప్రభుత్వం.. ద్రవ్య లోటు 79,926 కోట్లు గా పేర్కొంది. సాధారణ బడ్జెట్ తో పాటుగా రూ 48 వేల కోట్ల అంచనాలతో తో వ్యవసాయ బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టనున్నారు. వివిధ ప్రాజెక్టులలో నిధులు కొరత ను అధిగమించేందుకు బడ్జెట్ లో ప్రభుత్వం వయాబులిటీ గ్యాప్ ఫండ్ 2 వేల కోట్లు గా ప్రతిపాదించారు. హౌసింగ్ లో నడుస్తున్న గృహ నిర్మాణానికి ఎస్సీలకు 50 వేల రూపాయలు ST లకు 70 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

 

కేటాయింపులు

పాఠశాల విద్యకు రూ.31,806 కోట్లు, బిసి వెల్ఫేర్‌కు రూ. 23,260 కోట్లు, వైద్యారోగ్య శాఖకు రూ. 19,260 కోట్లు, పంచాయితీ రాజ్ అండ్ రూరల్ డెవలెప్మెట్రూ. 18,848కోట్లు కేటాయించారు. కాగా, జలవనరుల అభివృద్ది శాఖ రూ. 18,020 కోట్లు, మున్సిపల్ అండ్ అడర్బన్ డెవలెప్మెంట్ రూ. 13,862 కోట్లు, విద్యుత్ శాఖకు రూ. 13,600 కోట్లు ప్రతిపాదించారు. ఇక.. వ్యవసాయానికి రూ. 11,636 కోట్లు, సాంఘిక సంక్షేమం రూ. 10,909 కోట్లు, ఆర్ధికంగా వెనుకబడిన తరగతుల కు రూ. 10,619 కోట్లు, రవాణా శాఖకు రూ. 8,785 కోట్లు ప్రతిపాదించారు.

ANN TOP 10