ఇరిగేషన్ ఏఈఈ నికేశ్ అరెస్ట్
ఏసీబీ జడ్జి ఎదుట హాజరు
ఈ నెల 13వరకు రిమాండ్
దిమ్మతిరిగే రేంజ్‌లో అక్రమాస్తులు..
మూడు విల్లాలు, మూడు ఫామ్ హౌస్‌లు, ఖరీదైన కార్లు
తవ్వేకొద్దీ అక్రమాలు కోకొల్లలు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరిగేషన్ శాఖ ఏఈఈ నికేశ్ అరెస్ట్ అయ్యారు. ఏసీబీ అధికారులు నికేష్ ను అదుపులోకి తీసుకుని కార్యాలయానికి తరలించారు. ఆదివారం ఆయనను ఏసీబీ జడ్జి ఎదుట హాజరుపరిచగా ఈ నెల 13 వరకు రిమాండ్ విధించారు. దీంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
అవినీతి ఆరోపణలు రావడంతో..
శనివారం ఉదయం 6 గంటల నుంచి నికేశ్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అవినీతి ఆరోపణలు రావడంతో, అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో నికేశ్ సస్పెండ్ అయ్యారు. ఈ క్రమంలో ఆయనపై నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు శనివారం నికేశ్ ఇంటితోపాటు అతడి స్నేహితుతు, బంధువుల ఇళ్లలో మొత్తం 19చోట్ల సోదాలు నిర్వహించారు.
భారీగా అక్రమాస్తులు..
తనిఖీల్లో భారీగా అక్రమస్తులు కూడపెట్టినట్టు గుర్తించారు. వ్యవసాయ భూములతో పాటు బంగారం, మూడు విల్లాలు, మూడు ఫామ్ హౌస్ లు, ఖరీదైన కార్లు ఉన్నట్టు గుర్తించి సీజ్ చేశారు. మొత్తం అక్రమాస్తుల విలువ దాదాపు 300 కోట్ల వరకు ఉంటుందని, అంతేకాకుండా బహిరంగ మార్కెట్ లో వీటి ప్రస్తుత విలువకుంటే తొమ్మిది రెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. గండిపేట బఫర్ జోన్ లో నిబంధనలకు విరుద్ధంగా నికేశ్ అనుమతులు ఇచ్చినట్టు అధికారులు గుర్తించారు.