లగచర్ల లో భూ సేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. లగచర్లలో మల్టిపర్ఫస్ ఇండస్ట్రీయల్ పార్క్ కోసం ప్రభుత్వం స్పీడ్ పెంచింది. ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణపై రేవంత్ రెడ్డి సర్కార్ దృష్టి సారించింది. లగచర్లలో మొత్తం 497 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం బహిరంగ ప్రకటనను వికారాబాద్ జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. నిన్న లఘచర్లలో 110.32 ఎకరాలు, పోలేపల్లి గ్రామంలో 71.89 ఎకరాల భూ సేకరణకు శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. తాజాగా దూద్యాల మండలంలో మరో 497 ఎకరాల భూసేకరణకు ఆదివారం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. లగచర్ల, పోలేపల్లిలో ఫార్మా విలేజ్ భూ సేకరణ కోసం గత ఆగస్టులో ఇచ్చిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం వాపస్ తీసుకుంది. ఆ స్థానంలో మల్టి పర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సర్కార్ నిర్ణయం తీసుకుంది.
కాగా వికారాబాద్ జిల్లా లగుచర్ల, పోలేపల్లి, హకీంపేట పరిధిలో ఫార్మా విలేజ్ స్థానంలో మల్టిపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్‌కు సర్కార్ ప్రణాళికను రూపొందిస్తోంది. ఈ మేరకు మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు కోసం భూమిని సమీకరించనున్నట్లు నోటిఫికేషన్లో తెలియజేసింది. వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం లగచర్లలో 110.32 ఎకరాల భూ సేకరణకు నోటిఫికేషన్ విడుదలైంది.