డిప్యూటీ కలెక్టర్ వి.లచ్చిరెడ్డిని సీసీఎల్‌ఏ కార్యాలయంలో అసిస్టెంట్ సెక్రటరీ గా నియమిస్తూ రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జీఓ నంబర్ 408 ని విడుదల చేశారు. ఆయన్ను సీఏంఆర్వో ప్రాజెక్ట్ డైరెక్టర్ పోస్ట్ నుంచి ఆకస్మికంగా బదిలీ చేయడం సంచలనం సృష్టించింది. ఇప్పుడు అదే కార్యాలయానికి అసిస్టెంట్ సెక్రటరీ గా నియమించడం ఆసక్తిగా మారింది.