లాటిన్ అమెరికా దేశం పెరూలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఫుట్ బాల్ స్టేడియంలో పిడుగు పడడంతో ఆటగాడు దుర్మరణం పాలయ్యాడు. ఆటగాడిపై పిడుగు పడడాన్ని ప్రత్యక్షంగా చూసిన వారు తీవ్ర షాక్ కు గురయ్యారు. పెరూలోని హువాన్ కాయో ప్రాంతంలో ఓ సాకర్ మ్యాచ్ నిర్వహించారు.
అయితే, మ్యాచ్ మధ్యలో వర్షం పడడంతో రిఫరీ మ్యాచ్ నిలిపివేశారు. ఆటగాళ్లు తమ డగౌట్ కు వెళుతుండగా, పెద్ద శబ్దంతో పిడుగుపడింది. దాంతో ఓ ఆటగాడు, రిఫరీ కుప్పకూలిపోయారు. రిఫరీకి తీవ్రగాయాలు కాగా, ఆటగాడు నేరుగా పిడుగుపాటుకు గురికావడంతో అక్కడిక్కడే మరణించాడు. మరో నలుగురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ఘటన తాలూకు వీడియోను ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఏంఏ) తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసింది.
పెరూలోని హువాన్కాయోలో నిర్వహించిన ఓ ఫుట్బాల్ మ్యాచ్ మధ్యలో వర్షం పడటంతో ఆటను నిలిపివేసారు.వారంతా గ్రౌండ్ నుంచి వెళ్తుండగా ఒక్కసారిగా పిడుగు పడటంతో వాళ్లు కుప్పకూలారు. అందులో ఒకరు మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. pic.twitter.com/bCAp20Z0Vv
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) November 6, 2024