AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకే కుల గణన : సీఎం రేవంత్

రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను అమలు చేయడమే మా కర్తవ్యం

తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని, అందుకు.. కులగణన ప్రక్రియే నిదర్శనమన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కులగణన సంప్రదింపుల సమావేశానికి రాహుల్ హాజరైన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన రేవంత్.. రాహుల్ గాంధీ చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుతున్నామని ప్రకటించారు. రాహుల్ మాటిస్తే.. అది నాయకులకు శాసనమే అన్న రేవంత్.. రాష్ట్రంలోని అన్ని వర్గాల వారి జనాభా లెక్కలను పకడ్భందీగా తీస్తున్నామని ప్రకటించారు.

కులగణన సర్వేకు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్న రేవంత్.. ఈ కార్యక్రమం వెనుక.. అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని, సామాజిక న్యాయం అందించాలని చిత్తశుద్ధి ఉందన్నారు. ఎన్నికల్లో కేవలం వాగ్ధానాలు మాత్రమే ఇవ్వకుండా.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేసేందుకు సైతం గట్టిగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

సామాజిక, ఆర్ధిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని అందరికీ సమానంగా అందించేందుకు కుల గణన సర్వేను ప్రభుత్వం బాధ్యతగా భావిస్తోందని ప్రకటించారు. ఇలాంటి సర్వే గురించి పౌర సమాజం నుంచి సూచనలు తీసుకోవడానికి రాహుల్ గాంధీ నేరుగా రావడం గొప్ప విషయమన్నారు. ఈ నిర్ణయం తీసుకోవాలంటే గుండె ధైర్యం కావాలన్న సీఎం.. సామాజిక బాధ్యత, సమాన అవకాశాలు ఇవ్వాలన్న ఆలోచనతో ఇక్కడకు వచ్చారని అన్నారు.

మనది రైజింగ్ తెలంగాణ అంటూ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి.. కులగణన పూర్తి చేసి రాష్ట్రంలోని బీసీలకు న్యాయంగా అందాల్సిన రిజర్వేషన్లు దామాషా పద్దతిలో అందిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో చేపట్టిన కుల గణనను 2025 జన గణనలో పరిగణనలోకి తీసుకోవాలని వేదికపై నుంచ తీర్మానం చేశా

తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని, అందుకు.. కులగణన ప్రక్రియే నిదర్శనమన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కులగణన సంప్రదింపుల సమావేశానికి రాహుల్ హాజరైన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన రేవంత్.. రాహుల్ గాంధీ చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుతున్నామని ప్రకటించారు.
రాహుల్ మాటిస్తే.. అది నాయకులకు శాసనమే అన్న రేవంత్.. రాష్ట్రంలోని అన్ని వర్గాల వారి జనాభా లెక్కలను పకడ్భందీగా తీస్తున్నామని ప్రకటించారు.

కులగణన సర్వేకు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్న రేవంత్.. ఈ కార్యక్రమం వెనుక.. అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని, సామాజిక న్యాయం అందించాలని చిత్తశుద్ధి ఉందన్నారు. ఎన్నికల్లో కేవలం వాగ్ధానాలు మాత్రమే ఇవ్వకుండా.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేసేందుకు సైతం గట్టిగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

ANN TOP 10