AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ట్యాంక్‌బండ్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు, బైక్‌ ఢీ..

నగరంలోని ట్యాంక్‌బండ్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన ఓ కారు రాంగ్‌ రూట్లో వస్తున్న బైకును ఢీ కొట్టడంతో సదరు బైక్‌ రైడర్‌ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై ఈ రోజు (సోమవారం) ఉదయం బ్రహ్మయ్య (45) రాంగ్‌ రూట్లో వస్తున్నాడు. అదే సమయంలో వనస్థలిపురానికి చెందిన విజయ్‌ కుమార్‌ ఐమాక్స్‌ నుంచి కారులో వెళుతున్నాడు. సరిగ్గా టర్నింగ్‌ దగ్గరకు వచ్చేసరికి బ్రహ్మయ్య రాంగ్‌ రూట్లో రావడంతో అతడిని తప్పించబోగా కారు అదుపుతప్పి ఈ యాక్సిడెంట్‌ జరిగింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బ్రహ్మయ్యను ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటన గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ANN TOP 10