అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో( US Elections) ఈసారి రిపబ్లికన్ పార్టీ నేత డోనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తారని ప్రఖ్యాత ఆర్థికవేత్త క్రిస్టోఫర్ బరార్డ్ తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత కచ్చితమైన ఆర్థికవేత్తగా క్రిస్టోఫర్‌కు పేరున్నది. నవంబర్ 5వ తేదీన జరిగే దేశాధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విక్టరీ కొట్టనున్నట్లు ఆయన అంచనా వేశారు. బెట్టింగ్ మార్కెట్లు, ఎన్నికల సరళ, ఎలక్షన్ మాడ్యులర్స్ అంచనాలు, ఫైనాన్షియల్ మార్కెట్ల ఆధారంగా ట్రంప్ పార్టీ క్లీన్ స్వీప్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్ అకౌంట్‌లో వెల్లడించారు.
మార్కెట్ సెక్యూర్టీస్ మోనాకోలో చీఫ్ ఎకానమిస్ట్, స్ట్రాటజిస్ట్‌గా బెరార్డ్ చేస్తున్నారు. గత 11 ఏళ్ల నుంచి బ్లూమ్‌బర్గ్ ఆర్థిక ర్యాంకింగ్స్ అంచనాలు వేస్తున్నారాయన. అంచనాలు వేయడంలో అతనికి అసాధారణ ట్రాక్ రికార్డు ఉన్నది. గ్రాండ్ ఓల్డ్ పార్టీ (జీవోపీ) సేనేట్‌లో ఆధిపత్యం సాధిస్తుందని, అయితే హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో పోటీ తీవ్రంగా ఉంటుందని, కానీ అది రిపబ్లికన్లకు ఫేవర్ చేసే అవకాశాలు ఉన్నట్లు క్రిస్టోఫర్ అంచనా వేశారు.
ట్రంప్ నేతృత్వంలోని అమెరికా సర్కారు తాత్కాలికంగా ఆర్థిక ప్రగతి సాధించనున్నట్లు చెప్పారు. 2025లో వృద్ధి రేటు 2.3 శాతానికి చేరుకోనున్నట్లు చెప్పారు.