ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ ఆమెర్ అలీ ఖాన్
కంది శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు
కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్సీ ఆమెర్ ఆలీ ఖాన్
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యమన్న నేతలు
అమ్మన్యూస్ ఆదిలాబాద్ :
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో పార్టీ గతంలో ఎన్నడూలేనంతగా బలో పేతమవుతోంది. నిత్య చేరికలతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నెలకొంటోంది. స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట జరుగుతున్న ఈ చేరికలతో పార్టీలో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఆదివారం తల్లెల రాకేష్,బింగి భూమన్న,పాండురంగ్,షేక్ బాబా,కోరం అశోక్ ఆధ్వర్యంలో జైనథ్ మండలం లేఖర్ వాడ బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అలాగే ఆదిలాబాద్ రూరల్ మండలం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అల్చెట్టి నాగన్న ఆధ్వర్యంలో బంగారిగూడ, యాపల్ గూడ , యశ్వంత్ గూడ ,జమ్ముల్దారి నుండి గ్రామస్తులు తరలివచ్చి కంది శ్రీనివాస రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యఅతిథి ఎమ్మెల్సీ ఆమెర్ ఆలీఖాన్ వారందరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్సీగా ఆదిలాబాద్ కు రెండోసారి రావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ ఆమెర్ ఆలీ ఖాన్ అన్నారు.ఆదిలాబాద్ నియోజక వర్గం లో కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తున్న కంది శ్రీనివాస రెడ్డి ని కొనియాడారు.
వచ్చే ఎన్నికల్లో ఆయన తప్పకుండా ఎమ్మెల్యేగా గెలుస్తారని చెప్పారు.పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు పని చేస్తుందని తెలిపారు. ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్లమెంట్ ఎన్నికల నాటికంటే ప్రస్తుతం నియోజకవర్గంలో పార్టీ అత్యంత పటిష్టంగా తయారైందని కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. ఇప్పటిలా క్యాడర్ ఆనాడు ఉంటే ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగిరేదన్నారు. అయినప్పటికీ ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పుంజుకునేలా తయారు చేసామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా కలసి పని చేయాలని పిలుపు నిచ్చారు. గరీబోళ్ల కోసం పని చేసే కాంగ్రెస్ పార్టీని ఆదరించాలన్నారు. గ్రామాల్లో ప్రతీ నాయకుడు,కార్యకర్త ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమం లో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి,జైనథ్,బేలా మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి,వైస్ చైర్మన్ విలాస్ పటేల్ సవాపురే,కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆశమ్మ, సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్,ఎం.ఏ షకీల్,తాజా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని,లోక ప్రవీణ్ రెడ్డి,కౌన్సిలర్లు బండారి సతీష్,సంద నర్సింగ్,జాఫర్ అహ్మద్,మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ ఇజ్జగిరి సంజయ్ కుమార్,మాజీ జడ్పీటీసీ రాందాస్ నాక్లే,బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సంజయ్ గుండవార్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వామన్ వాంఖడే,మాజీ మున్సిపల్ చైర్మన్ బాదన్ గంగన్న,ఆదిలాబాద్ రూరల్ మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అల్చెట్టి నాగన్న,నాయకులు పోరెడ్డి కిషన్,యెల్టీ భోజా రెడ్డి,రాజా లింగన్న,ఎల్చల్వార్ సురేందర్, అడ్డి రూకేష్ రెడ్డి,మహిపాల్ రెడ్డి,ఎం.ఏ కయ్యుమ్,మున్నా,సీతారామ్,బాసా సంతోష్,పత్తి ముజ్జు,మంచాల మల్లయ్య,ఓరగంటి అఖిల్,సహిద్ ఖాన్,షేక్ మన్సూర్,అశోక్,అతిక్ ఉర్ రహమాన్,అల్లాబకష్ మహిళా నాయకురాలు శ్రీలేఖ ఆదివాసీ, గైదానే లత,సోనియా మంథని,దేశెట్టి ప్రభావతి,ప్రేమల,ఉమా,రమ,ఆలం రూప రోస్లిన్,జ్యోతి,నల్వాల సుమ,అఫ్రోజ్,ఖమర్ బేగం తదితరులు పాల్గొన్నారు.