అమ్మన్యూస్ ఆదిలాబాద్ : పట్టణంలో వినాయక చవితి నవరాత్రోత్సవాలు మరింత ఘనంగా జరుగుతున్నాయి. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస రెడ్డి సతీమణి కంది మౌనా శ్రీనివాస రెడ్డి సోమవారం రెడ్డి సంఘం గణేశ్ మండపాన్ని సందర్శించారు. నిర్వాహకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ముందుగా గణపతిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన ముగ్గుల పోటీలో స్థానిక మహిళలతో కలిసి ముగ్గులు వేసి అలరించారు.
