AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పోలీసులతో హైడ్రా మరింత బలోపేతం

హైదరాబాద్ లో అక్రమ కట్టాలను కూల్చేస్తున్న హైడ్రాను మరింత బలంగా చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. హైడ్రా యాక్షన్స్‌కు ఏం సమస్యలూ రాకుండా పోలీసు బలాన్ని కూడా యాడ్ చేస్తున్నారు. దీని కోసం ఇప్పటకే తెలంగణ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఇందులో భాగంగా..15 మంది ఇన్‌స్పెక్టర్లు, ముగ్గురు రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు…ఆరుగురు ఎస్‌ఐలను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు లా అండ్‌ ఆర్డర్‌ డీజీ మహేష్‌ భగవత్‌. ఇతర జిల్లాల్లో పని చేస్తున్న వారిని ఇక్కడకు రప్పించి..హైడ్రాకు కేటాయిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇకపై హైడ్రాలోనే పని చేయాలని ఇన్‌స్పెక్టర్లకు చెప్పారు. భవిష్యత్తులో హైడ్రాకు పోలీస్‌ స్టేషన్లను కూడా కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ANN TOP 10