AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

న‌టి మ‌లైకా అరోరా తండ్రి ఆత్మ‌హ‌త్య‌

ముంబై : బాలీవుడ్ న‌టి మ‌లైకా అరోరా తండ్రి.. సూసైడ్ చేసుకున్నారు. ముంబైలోని బాంద్రాలో ఉన్న త‌న ఇంటి ఏడో అంత‌స్థు నుంచి ఆయ‌న కిందకు దూకి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. అనిల్ అరోరా(Anil Arora) ఇవాళ ఉద‌యం ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. మ‌లైకా అరోరా మాజీ భ‌ర్త అర్బాజ్ ఖాన్‌, సీనియ‌ర్ పోలీసు అధికారులు అనిల్ అరోరా ఇంటికి చేరుకున్నారు. అత‌ని పార్దీవ‌దేహాన్ని పోస్టుమార్ట‌మ్ కోసం పంపించారు. ఆత్మ‌హ‌త్య కేసులో ముంబై పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నారు.

అయితే, గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలిసింది. ఘటన జరిగిన సమయంలో మలైకా అరోరా ఇంట్లో లేరు. ప్రస్తుతం పూణెలో ఉన్న ఆమె సమాచారం అందుకున్న వెంటనే ముంబైకి బయలుదేరారు. అనిల్ అరోరా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ANN TOP 10