AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఈ నెల 16న ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 16న ఆయన ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఆయనతో పాటు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

ఈ పర్యటనలో మంత్రివర్గ విస్తరణపై ప్రధానంగా చర్చించే అవకాశాలు ఉన్నాయి. అలాగే నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ కార్యవర్గ కూర్పు తదితర అంశాలపై పార్టీ అధిష్ఠానంతో చర్చించే అవకాశం ఉంది.

పీసీసీ అధ్యక్ష పదవి, కేబినెట్ విస్తరణ వంటి అంశాలపై పార్టీ అధిష్ఠానం చాలా రోజులుగా కసరత్తు చేస్తోంది. ఇటీవలే అధ్యక్షుడిని నియమించారు. సామాజిక సమీకరణాల విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కేబినెట్ విస్తరణ వాయిదా పడుతూ వస్తోంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10