రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమాకు సంబంధించిన తాజా ఓటీటీ రిలీజ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకుంది. సమాచారం ప్రకారం, ఈ సినిమా జులై 2న ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే కొన్ని నివేదికల ప్రకారం ఈ తేదీ జులై 16కు మారే అవకాశం కూడా ఉంది. దీనిపై నెట్‌ఫ్లిక్స్ లేదా చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
బాక్సాఫీస్ కలెక్షన్లు
Advertisement
ఈ సినిమాకు మిశ్రమ సమీక్షలు (Mixed reviews) వచ్చినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ. 400 కోట్ల గ్రాస్ మార్కును దాటినట్లు నివేదికలు చెబుతున్నాయి. థియేటర్లలో 19వ రోజు నాటికి భారతదేశంలో ఈ సినిమా నెట్ కలెక్షన్లు రూ.235.10 కోట్లకు చేరుకున్నాయి. ప్రస్తుతం 3వ వారంలో ఉన్న ఈ సినిమా వసూళ్లు కాస్త మందగించాయి. 19వ రోజున దేశవ్యాప్తంగా రూ.83 లక్షల నెట్ వసూళ్లను సాధించింది. సినిమాకు వస్తున్న భారీ స్పందనతో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లోనే అధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఓటీటీలో విడుదలై మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.








