తెలంగాణ రాష్ట్రంలో 2025-26 సంవత్సరాల్లో యాసంగి (రబీ) సీజన్‌లో అనుకున్న దాని కంటే ఎక్కువ రికార్డు స్థాయిలో తెలంగాణలో వరి ధాన్యం సేకరణ జరిగింది. దీంతో కేంద్ర ప్రభుత్వం వరి కొనుగోలు లక్ష్యాన్ని పెంచాలంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అందుకుగాను తెలంగాణ నుండి వ్యవపాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి, నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి కలిసి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసారు.
మొత్తం 152 లక్షల మెట్రిక్ టన్నులు..
2025-26 రబీ సీజన్‌కు సంబంధించి కేద్ర ప్రభుత్వం వరి సేకరణ లక్ష్యాన్ని పెంచాలని తెలంగాణ మంత్రులు కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషికి తెలిపారు. దాదాపుగా తెలంగాణలో ఇప్పటికే 80 లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరించామని అధికారు తెలిపారు. రాష్టంలో 2025-26లో ఖరీఫ్, రబీ సీజన్లు రెండూ కలిసి మొత్తం 152 లక్షల మెట్రిక్ టన్నుల వరి సేకరణ చేసామని తెలంగాణ మంత్రులు తెలిపారు.
చరిత్రలోనే..
తెలంగాణ, ఉమ్మడి ఆంద్రప్రదేశ్ చరిత్రలోనే మునుపెన్నడు జరగని విధంగా రికార్డు స్థాయిలో వరి సేకరన చేసామని కేంద్రమంత్రి ప్రహ్లద్ జోషికి మంత్రి ఉత్తం, తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. రాష్రంలో ప్రస్తుతం ఉన్న 52 లక్షల మెట్రిక్ టన్నుల రబీ వరి సేకరణ లక్ష్యాన్ని 80 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలని కేంద్ర మంత్రిని కోరారు.








