AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేవంత్ నీ కౌంట్ డౌన్ స్టార్ట్..! హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు..!

రేవంత్ రెడ్డి హిట్లర్ ఆదర్శ మంటున్నారు. హిట్లర్ ను చూసి హైడ్రా ఏర్పాటు చేసినా అంటున్నారు. ఎవరైనా హిట్లర్ ను ఆదర్శంగా తీసుకుంటారా? అని బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీ ష్ రావు విమర్శించారు . ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాధపాలెం మండలం సర్వేనెంబర్ 218లో ప్లాట్లు కోల్పోతున్న బాధితులు మంగళవారం హరీశ్ రావును కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హరీష్ రావు మాట్లాడుతూ అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.

 

నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది..

రెండున్నర ఏండ్లు పూర్తయిపోయింది నీ పాలనకు పేదల ఉసురు పోసుకోకు, పేదలు తిరగబడే రోజులు వస్తాయి జాగ్రత్త అని హెచ్చరిస్తున్నా అన్నారు. ఆసుపత్రులను, కాలేజీలను బ్రతికించు. నీ పనుల వల్ల ప్రైవేట్ ఆస్పత్రులు, కాలేజీలు మూతపడే పరిస్థితి వచ్చింది. ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ అన్నారు. ఆ స్కీమ్ ఇప్పటి దాకా ప్రారంభం కాలేదు. నువ్వు పైసలు ఇవ్వవు అని హాస్పిటల్ వాళ్ళు ఈ పథకంలో చేరబోమంటున్నారని విమర్శించారు. కానీ 1.5% శాతం మాత్రం ఉద్యోగుల జీతం కట్ చేశావు. ఇదేమని ఉద్యోగస్తులు అడిగితే, వాళ్ళను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఏసీబీ రైడ్లు చేయిస్తున్నారని ఆరోపించారు.

 

ఇందిరమ్మ పేరుతో హిట్లర్ రాజ్యం..

ఇందిరమ్మ రాజ్యమంటే పేదలకు ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇస్తారని తెలిసో, తెలియకో పేదోడు గూడేసుకుంటే ఇందిరమ్మ రాజ్యంలో ఇంటి పట్టా ఇస్తారనుకున్నాం. కానీ ఇందిరమ్మ రాజ్యం పేరుతో హిట్లర్ రాజ్యం సృష్టి స్తున్నారని హరీష్ రావు ఎద్దేవాచేశారు. వెలుగుమట్లలో పేదల జోలికి వస్తే రాష్ట్రమంతా కాంగ్రెస్ ప్రభుత్వ పరువు పోయింది. వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. సోయి రాలేదు. ఇప్పుడేమో రఘునాథపాలెంలో షురూ చేశారు. సర్వే నెంబర్ 218లో బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో పేదలకు ఇళ్ల పట్టాలు, స్థలాలు ఇచ్చింది. కరెంటు పోల్స్ , నల్లా కలెక్షన్లు ఏర్పాటు, ప్లాట్లకు నెంబర్లు కూడా కేటాయించింది.చాతనైతే మీరు ఇల్లు కట్టించండి.ఇంటికి సాయం చేయండి. అసంపూర్తిగా ఉంటే పూర్తి చేయాలి. కానీ ఇల్లు లాక్కునే పరిస్థితి బాధాకరం అన్నారు. తక్షణమే ఆ ఆలోచన విరమించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాంblr, గృహలక్ష్మి కింద కొందరికి ఇండ్లు మంజూరు అయితే బేస్మెంట్లు, ఇల్లు కూడా కట్టుకున్నారు. వాటిని కూల్చడం దారుణం అని ఫైర్ అయ్యారు.

 

అశ్వారావుపేటలో..

మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రలతో కలిసి అశ్వారావుపేటలో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ సర్కార్ రెండున్నరేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని స్కామ్ ల ప్రభుత్వం పోవాలి.. స్కీమ్‌ల ప్రభుత్వం రావాలి.. కేసీఆర్ సీఎం కావాలని సర్వత్రా కోరుకుంటున్నారని హరీష్ రావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో మంగళవారం బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరిగింది.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాజీమంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్ రావు, తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు,రేగా కాంతారావు లు మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలకులు అవలంభిస్తున్న తప్పుడు విధానాలను అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు.కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు.

ANN TOP 10