రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం పట్టుకున్నారు. రూ.70 లక్షల విలువ చేసే 1100 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దీనిలో భాగంగా ఇద్దరిని అరెస్ట్ చేశారు. బంగారాన్ని క్యాప్సూల్స్‌లో నింపి పొట్టలో దాచి తరలించే యత్నం చేసిన కేటుగాడు. కస్టమ్స్ అధికారులు నిర్వహించిన స్క్రీనింగ్‌లో బంగారం బయట పడింది. మరో ప్రయాణీకుడి లగేజ్ బ్యాగ్ లో అక్రమ బంగారాన్ని గుర్తించారు. ఇద్దరు దుబాయ్ ప్రయాణికులపై కస్టమ్స్ అధికారులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.