AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మెక్సికోలో అగ్నిప్రమాదం: 39 మంది మృతి

ఉత్తర మెక్సికోలోని ఇమిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్‌లో మంటలు చెలరేగి 39 మంది మరణించగా మరో 29 మంది గాయపడినట్లు జాతీయ ఇమిగ్రేషన్ సంస్థ అధికారి ఒకరు వెల్లడించారు. చట్టవిరుద్ధంగా దేశంలో నివసిస్తున్న విదేశీయులను నిర్బంధంలో ఉంచడానికి ఏర్పాటు చేసిన కేంద్రంలో మంగలు చెలరేగినట్లు తన పేరును వెల్లడించడానికి ఇష్టపడని ఆ అధికారి అనధికారికంగా తెలిపారు. అమెరికాకు సరిహద్దున ఉన్న మెక్సికోలోని ఈ డిటెన్షన్ సెంటర్‌లో మంటలకు సజీవదహనమై పడి ఉన్న మృతదేహాలు పడిఉన్నట్లు ఆయన చెప్పారు. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగినుట్ల డైరియో జువరెజ్ న్యూస్‌పేపర్ తెలిపింది. ఈ ప్రమాదంలో 39 మంది మరణించగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపింది.

ANN TOP 10