AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

డ్రగ్స్‌పై ఉక్కుపాదమే.. మత్తు పదార్థాల నిర్మూలనే లక్ష్యం.. నగర సీపీగా సీవీ ఆనంద్‌ బాధ్యతల స్వీకరణ

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్‌పై చాలా సీరియస్‌ గా ఉందని, డ్రగ్స్, గంజాయి నిర్మూలనే లక్ష్యంగా కృషి చేస్తానని హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ అన్నారు. హైదరాబాద్‌ 61వ పోలీస్‌ కమిషనర్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సీవీ ఆనంద్‌ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం సీపీ కార్యాలయంలో ప్రస్తుత సీపీ శ్రీనివాస్‌ రెడ్డి నుంచి ఆయన ఛార్జ్‌ తీసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌ సీపీగా రెండోసారి బాధ్యలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు కృషి చేస్తానని తెలిపారు. నగరంలో లా అండ్‌ ఆర్డర్‌ను మరింత మెరుగుపరుస్తామని చెప్పారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అనేది పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఒక భాగమని వెల్లడించారు. ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ఉంటుందని.. క్రిమినల్స్‌పై ఉక్కుపాదం మోపుతామన్నారు.

నిమజ్జన ప్రశాంతంగా జరిగేలా చర్యలు..
వినాయక నిమజ్జనం చాలా కీలకమైన అంశం అని చెప్పారు. నిమజ్జన ఘట్టం ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని విన్నానని.. ట్రాఫిక్‌ సమస్యను కూడా పరిష్కరిస్తామన్నారు. హత్యలు, అత్యాచారాలు, లా అండ్‌ ఆర్డర్‌పై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. కాగా, సీపీగా సీవీ ఆనంద్‌ నియామకంతో ఏదాడి కాలంలోనే నాలుగో కొత్వాల్‌గా రికార్డులకు ఎక్కారు. మొదటి, నాలుగు స్థానాలు ఆనంద్‌వే కావడం గమనార్హం. మధ్యలో మాత్రం శాండిల్య, శ్రీనివాసరెడ్డి పని చేశారు. ఆయన తొలిసారిగా 2021లో హైదరాబాద్‌ సీపీగా నియమితులయ్యారు. ఆ ఏడాది డిసెంబర్‌ 25 నుంచి గతేడాది అక్టోబర్‌ 12 వరకు విధులు నిర్వర్తించారు. అయితే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆ మరుసటి రోజు బదిలీ అయ్యారు. అప్పటి నుంచి గత ఏడాది డిసెంబర్‌ 13 వరకు సందీప్‌ శాండిల్య పోలీసు కమిషనర్‌గా వ్యవహరించారు. ఆ మరుసటి రోజు బాధ్యతలు స్వీకరించిన కొత్తకోట శ్రీనివాస రెడ్డిని ఈ నెల 7న బదిలీ చేసిన ప్రభుత్వం.. మళ్లీ సీవీ ఆనంద్‌నే సీపీగా నియమించింది. దీంతో 21 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌కు డీజీపీ స్థాయి అధికారిని కొత్వాల్‌గా నియమించడం ఇదే మొదటిసారి.
ఇన్నోవేటివ్‌ లీడర్‌షిప్‌ అవార్డు..
సీవీ ఆనంద్‌ ఇంతకుముందు అంతకుముందు ఆయన కేంద్ర సర్వీసుల్లో అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌గా సేవలు అందించారు. 2017లో రాష్ట్రపతి పోలీసు పతకంతో పాటు ఇన్నోవేటివ్‌ లీడర్‌షిప్‌ అవార్డు కూడా అందుకున్నారు.

ANN TOP 10