AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేవంత్‌ సర్కార్‌కు బిగ్‌ రిలీఫ్‌.. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీల నియామకాలకు సుప్రీం గ్రీన్‌ సిగ్నల్‌

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల నియామకంలో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. ఎమ్మెల్సీల నియామకానికి సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కొత్తగా నియామకాలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో బీఆర్‌ఎస్‌ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ వేసిన పిటిషన్‌ ను తిరస్కరించింది. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల నియామకలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌పై స్టే విధించింది. కొత్తగా నియామకాలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో బీఆర్‌ఎస్‌ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. దాసోజు తరఫున కపిల్‌ సిబల్‌ వాదించారు. వారి వేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు తిరస్కరించింది. కొత్త నియామకాలు ప్రభుత్వ బాధ్యతని ధర్మాసనం స్పష్టం చేసింది. గవర్నర్‌ నామినేట్‌ చేయడాన్ని అడ్డుకోలేమని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు హైకోర్టు ఆదేశాలపై స్టే ఉంటుందని జస్టిస్‌ విక్రంనాథ్‌ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.

ANN TOP 10