నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి మెడికోలు నిరసన చేపట్టారు. కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనకు నిరసనగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వైద్య విద్యార్థులు మాట్లాడుతూ డాక్టర్‌ను హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశంలో మహిళా వైద్యులకు రక్షణ కల్పించాలన్నారు. వైద్యులపై అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు చట్టవిర్దుంగా వ్యహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.