AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మాజీ హెల్త్ డైరెక్ట‌ర్ గ‌డ‌ల శ్రీనివాస్ రావు వీఆర్ఎస్ ఆమోదం..

మాజీ హెల్త్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ గ‌డ‌ల శ్రీనివాస్ రావు వీఆర్ఎస్‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆమోదించింది. ఈ మేర‌కు హెల్త్ సెక్ర‌ట‌రీ క్రిస్టినా చొంగ్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ నెల 8న ఇచ్చిన ఉత్త‌ర్వులు సోమ‌వారం వెలుగులోకి వ‌చ్చాయి. శ్రీనివాస్ రావు వీఆర్ఎస్ ఆమోదానికి సంబంధించిన ఉత్త‌ర్వులు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

మాజీ డీపీహెచ్‌ గడల శ్రీనివాసరావును ప్రభుత్వం జులై 27న‌ బదిలీ చేసిన సంగ‌తి తెలిసిందే. పబ్లిక్‌ హెల్త్‌ విభాగంలో జాయింట్‌ డైరెక్టర్‌ క్యాడర్‌లో ఉన్న ఆయనను మహబూబాబాద్‌ అడిషినల్‌ డిస్ట్రిక్ట్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఆఫీసర్‌ (ఏడీపీహెచ్‌వో)గా నియమించింది. మరో ముగ్గురు ఏడీపీహెచ్‌వోలను కూడా బదిలీ చేస్తూ హెల్త్‌ సెక్రటరీ క్రిస్టినా చొంగ్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

గ‌త నెల 27న మ‌హ‌బూబాబాద్ అడిష‌న‌ల్ డిస్ట్రిక్ట్ ప‌బ్లిక్ హెల్త్ ఆఫీస‌ర్‌గా గ‌డ‌ల శ్రీనివాస్ రావును ప్ర‌భుత్వం నియ‌మించింది. కానీ ఆయ‌న లాంగ్ లీవ్‌లో ఉండ‌డంతో జాయిన్ అవ్వ‌లేదు. ఇన్‌ఛార్జి డీహెచ్ పోస్టు నుంచి త‌ప్పుకున్నాక ఆయ‌న లాంగ్ లీవ్‌లోనే ఉన్నారు. గడల శ్రీనివాసరావు వీఆర్‌ఎస్‌కు రెండుసార్లు దరఖాస్తు చేయ‌గా, తాజాగా ఆయ‌న వీఆర్ఎస్‌ను ఆమోదిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10