AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం.. అతి త్వరలో జాబ్‌ క్యాలెండర్‌.. మంత్రి శ్రీధర్‌ వెల్లడి

యువతకు స్కిల్స్‌లో శిక్షణ ఇస్తాం
సభలో స్కిల్‌ వర్సిటీ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఎనిమిదవరోజు ప్రారంభమయ్యాయి. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీలతో హాజరయ్యారు. మూడు బిల్లులు ప్రవేశపెట్టాల్సి ఉండటంతో ఈరోజు కూడా సభలో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. అనంతరం మంత్రి శ్రీధర్‌ స్కిల్‌ వర్సిటీ బిల్లును ప్రవేశపెట్టి దానిపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అతి త్వరలోనే జాబ్‌ క్యాలెండర్‌ ను విడుదల చేస్తామని ప్రకటించారు. మొత్తం 2 లక్షల ఉద్యోగాలను.. వివిధ శాఖలలో భర్తీ చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న యువత మొత్తానికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని తెలిపారు. అందుకే యువతకు స్కిల్స్‌ లో శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. స్కిల్స్‌ పెంపుపై యూనివర్సిటీల వీసీలు, పారిశ్రామికవేత్తలతో చర్చించామని.. రాష్ట్ర యువతకు ఇక్కడే ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

యువతకు శిక్షణ..
మార్కెట్లో ఉన్న డిమాండ్లకు అనుగుణంగా యువతకు స్కిల్స్‌ లో శిక్షణ ఇచ్చేలా చర్యలు చేపడతామన్నారు. అంతర్జాతీయ పరిశ్రమలు కూడా ఇక్కడికే వచ్చి కంపెనీలు పెట్టేలా స్కిల్స్‌ నేర్పిస్తామన్నారు. ఇది సరికొత్త ఆలోచన అని, రాష్ట్ర ప్రభుత్వం యువత భవిష్యత్‌ కోసం చేస్తున్న ఈ ప్రయత్నం సక్సెస్‌ అవుతుందన్నారు మంత్రి శ్రీధర్‌.

ANN TOP 10